
Andhra Cricket Association 70 years Celebrations: భారత క్రికెట్‌కు ఎదురవుతున్న ముఖ్యమైన ఛాలెంజ్ క్రికెటర్ల ఫిట్‌నెస్ అని భారత కికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ అభిప్రాయ పడ్డారు. ఈ సవాల్‌ను స్వీకరించామని, అధిగమించేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నామన్నారు బిన్నీ. ముఖ్యంగా ఈ విషయంలో క్రికెటర్లకు బీసీసీఐ పూర్తి అండగా నిలిచిందన్నారు బీసీసీఐ చీఫ్ బిన్నీ.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ – ఏసీఏ 70 సంవత్సరాల వేడుకలకు 1983 వరల్డ్ కప్ విజేతల బృంద సభ్యులు మదన్ లాల్, కృష్ణమాచారి శ్రీకాంత్ లతో కలిసి రోజర్ బిన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏసీఏ పాలకమండలితో కలిసి 70 వసంతాల స్మారక చిహ్నంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిన్నీ మీడియాతో మాట్లాడారు.
దేశంలో క్రికెట్‌ను ప్రేమించే ప్రతీ ముగ్గురిలో ఇద్దరు భారత్ ప్రపంచ కప్‌ను గెలవాలని కోరుకుంటుందని, త్వరలో నెరవేరే అవకాశం ఉందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు బిన్నీ. అందుకు అనుగుణంగా క్రికెట్ క్రీడకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఏపీఎల్, ఐపీఎల్ వంటి టోర్నీల వల్ల యువ ఆటగాళ్ల ప్రతిభ వెలికి చూసి వాళ్ళ కెరీర్ కు అద్భుతంగా దోహదం చేస్తుందన్నారు. అదే సమయంలో మహిళా క్రికెట్ అభివృద్ధికి కూడా బీసీసీఐ ఎంతో కృషి చేస్తుందన్నారు బిన్నీ.
Roger Binny sees bright future for young talent from AP👏👏💐💐
BCCI President Roger Binny lauded Andhra Premier League for emerging as a great platform for the budding talent to showcase their talent pic.twitter.com/O9sj12Eysj
— Bhaskar reddy (@chicagobachi) August 29, 2023
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి నేటితో 70 సంవత్స రాలు పూర్తి చేసుకుంది. 1953లో ప్రారంభమైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అసోసియేషన్ సాధించిన విజయాలతో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది ఏసీఏ. రాష్ట్రంలో క్రికెట్ క్రీడాభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియే షన్ ఏర్పడిన తర్వాత నలుగురు అంతర్జాతీయ క్రికెటర్ల తో పాటు మహిళా అంతర్జాతీయ క్రికెటర్లు పలువురిని తయారుచేసినట్టు తెలిపింది ఏసీఏ. బాల బాలికలకు చిన్న వయసు నుండి క్రికెట్ పై అవగాహన కల్పించి, మెలుకువలు నేర్పి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చి దిద్దుతున్నట్టు తెలిపింది బీసీసీఐ. ఈ సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో వెటరన్ క్రికెటర్లతో పాటు ఏ సీ ఏ పాలక మండలి పాల్గొంటోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..