Andre Russell: ఆండ్రీ రస్సెల్‌ని మరిచిపోయారా.. ఈ కరీబియన్ ఆల్‌రౌండర్ మళ్లీ బ్యాట్‌కి పనిచెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఈ ఆటగాడు ఆస్ట్రేలియా పిచ్‌పై బౌలర్లను ఊచకోతకోస్తున్నాడు. తాజాగా రస్సెల్ తుఫాను ఇన్నింగ్స్ బిగ్ బాష్ లీగ్‌లో కనిపించింది. సిడ్నీ థండర్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది.
సిడ్నీ థండర్ తరఫున అలెక్స్ రాస్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున కైస్ అహ్మద్, బ్రాడీ కౌచ్ 2-2 వికెట్లు పడగొట్టి విజయవంతమైన బౌలర్లుగా నిలిచారు. ఆండ్రీ రస్సెల్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు. కానీ వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. బంతితో వైఫల్యం చెందినా బ్యాట్‌తో రచ్చ చేశాడు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ స్టార్స్ 12వ ఓవర్లో 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి దిగగానే తుపాను సృష్టించడం మొదలుపెట్టి చివరి వరకు అజేయంగా తన జట్టును గెలిపించి వెనుదిరిగాడు.
6 బంతుల్లో 34
రస్సెల్ 21 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 5 సిక్స్‌లు, 1 ఫోర్‌తో అజేయంగా 42 పరుగులు చేశాడు. అంటే తన విలువైన ఇన్నింగ్స్‌లో కేవలం 6 బంతుల్లో 34 పరుగులు రాబట్టాడు. 5 సిక్సర్లతో, మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రస్సెల్ సృష్టించిన ఈ తుఫాను ప్రభావంతో మెల్‌బోర్న్ స్టార్స్ 17.1 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యాన్ని 17 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఈ లీగ్‌లో ఆండ్రీ రస్సెల్ నేతృత్వంలోని 3 మ్యాచ్‌ల్లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ఇది రెండో విజయం. 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన కరేబియన్ ఆల్ రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.