
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశం జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో ఇండోనేషియాలోని బాలిలో జరగనుంది. ఈ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు జైషా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. జైషా ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శితో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ పదవి నుంచి షా త్వరలో వైదొలగవచ్చని వార్తలు వస్తున్నాయి. జై షా ప్రెసిడెంట్ పదవిని వదిలేయడానికి కారణం ఏంటని ఆరాతీస్తే.. ఇన్నాళ్లు భారత క్రికెట్‌తో పాటు ఆసియా క్రికెట్‌లో చక్రం తిప్పిన జై షా ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అంటే జై షా ఇప్పుడు ఐసీసీ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జై షా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఐసీసీ అధ్యక్షుడైతే భారత క్రికెట్ అభిమానులకు అది గొప్ప వార్తే అవుతుంది. ఈ కారణంగా జైషా ఏసీసీకి రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. బాలిలో జరిగే ACC వార్షిక సమావేశం 2 రోజుల పాటు జరుగుతుంది, ఇందులో ఆసియాలోని క్రికెట్ బోర్డు సభ్యులందరూ పాల్గొంటారు
జై షా ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరోవైపు ఏసీసీ అధ్యక్షుడిగానూ పని చేస్తున్నారు. ACCలో అధ్యక్ష పదవికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అంటే జై షా పదవీకాలం మరో ఏడాది మిగిలి ఉంది. అయితే ఐసీసీ ఎన్నికల నేపథ్యంలోజై షా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుని ఏడాది ముందుగానే ఏసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ సెక్రటరీ పదవికి జై షా ఎప్పుడు రాజీనామా చేస్తారా.. లేదా? దీని గురించి ఇంకా సమాచారం లేదు.
తదుపరి ఆసియా కప్ 2025లో నిర్వహించబడుతుంది . ఇది T20 ఫార్మాట్‌లో జరుగుతుంది. అందుకే ఈ టోర్నీ నిర్వహణపై కూడా ఏసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 2025 ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఒమన్, యూఈఏ పోటీపడుతున్నాయి.
Congratulations to India U19 for their impressive win in the ICC U19 World Cup 2024 against USA securing victory by 201 runs! Naman Tiwari demonstrated his skill by taking four wickets, and Arshin Kulkarni’s outstanding century contributed significantly to the team’s victory.… pic.twitter.com/mWzPbKk3Q0
— Jay Shah (@JayShah) January 28, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..