Team India: కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?

Kohli-Rohit Impact on BCCIs Sponsorship: క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం భారీగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక్కో మ్యాచ్‌కు 4.85 కోట్ల కనీస ధరను నిర్ణయించినా, స్పాన్సర్ షిప్ కోసం ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదంట. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు దూరం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Team India: కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
Kohli Rohit Impact On Bcci Sponsorship

Updated on: Aug 25, 2026 | 4:10 PM

Kohli-Rohit Impact on BCCIs Sponsorship: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న బోర్డుగా పేరుగాంచిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్రస్తుతం టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టింది. అయితే, స్పాన్సర్ల నుంచి భారీ డిమాండ్ వస్తుందనుకున్న తరుణంలో అనూహ్యమైన సవాళ్లను బీసీసీఐ ఎదుర్కొంటోంది. రాబోయే 2 ఏళ్లకు టీమ్ ఇండియా టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం బీసీసీఐ ఒక్కో మ్యాచ్‌కు 4.85 కోట్ల రూపాయల కనీస ధరను నిర్ణయించింది. అయితే, బోర్డు అంచనాలకు తగిన ఆఫర్‌లు రాకపోవడంతో బిడ్ దాఖలు గడువు ముగిసిపోవడమే కాకుండా, దానిని పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది బీసీసీఐ చరిత్రలో ఒక అరుదైన పరిణామంగా చెబుతున్నారు.

ప్రస్తుతం టీమ్ ఇండియాకు టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మునుపటి ఒప్పందం ప్రకారం ఒక్కో మ్యాచ్‌కు 4.2 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. అయితే, బీసీసీఐ ఇప్పుడు ఈ ధరను గణనీయంగా పెంచడంతో స్పాన్సర్‌లు ముందుకు రావడానికి సంకోచిస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో భారత జట్టు సుమారు 35 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ భారీ క్యాలెండర్ ద్వారా స్పాన్సర్‌షిప్ హక్కులు పొందిన సంస్థ నుంచి పెద్ద మొత్తంలో నగదును ఆశించి, తద్వారా భారీ లాభాలను పొందాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎక్కువమంది చదివినది: Video: 0,W,4,0,W,0.. ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదానే..!

ఇవి కూడా చదవండి

అయితే, స్పాన్సర్‌ల నుంచి ఆశించిన స్పందన రాకపోవడానికి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజాలు, ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానగణం ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టులు, టీ20లకు కొంతకాలంగా దూరంగా ఉండటమే స్పాన్సర్‌లు అంత పెద్ద మొత్తంలో చెల్లించడానికి వెనకడుగు వేయడానికి ఒక ప్రధాన కారణం అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఆటగాళ్లు లేకపోవడం వల్ల మ్యాచ్‌లకు ఉండే ఆదరణ, బ్రాండ్ విలువ కొంతమేర తగ్గుతుందని స్పాన్సర్‌లు భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

బీసీసీఐ జూలై 20న టైటిల్ స్పాన్సర్‌షిప్ ఆహ్వానాన్ని విడుదల చేసింది. ఐటిటి (ఇన్విటేషన్ టు టెండర్) పత్రాల కొనుగోలుకు ఆగస్టు 4 చివరి తేదీగా, వివరణలు కోరడానికి ఆగస్టు 5 చివరి తేదీగా నిర్ణయించింది. బిడ్ సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 13 అయినప్పటికీ, భారత బోర్డుకు ఎలాంటి బిడ్లు అందలేదు. దీంతో బీసీసీఐ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎక్కువమంది చదివినది: SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబు‌లో భారీ జంప్..?

పలు నివేదికల ప్రకారం, బీసీసీఐ ఇప్పటికే గూగుల్ జెమిని, స్పిన్నీ, ఎస్‌బీఐ లైఫ్ వంటి ప్రముఖ కంపెనీలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి బోర్డు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా, బీసీసీఐ ఈవెంట్‌ల కోసం అసోసియేట్ పార్టనర్ హక్కులకై “రిక్వెస్ట్ ఫర్ కొటేషన్” (ఆర్ఎఫ్ క్యూ)ను కూడా విడుదల చేసింది. టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను కొనుగోలు చేసిన బ్రాండ్ అసోసియేట్ పార్టనర్ హక్కులను పొందడానికి వీలులేదు. కాబట్టి, టైటిల్ స్పాన్సర్‌ ఖరారైన తర్వాతే ఈ హక్కులు ఖరారు చేయబడతాయి. ఆర్ఎఫ్ క్యూ పత్రాలను కొనుగోలు చేయడానికి ఆగస్టు 14 చివరి తేదీ కాగా, వివరణలు ఇవ్వడానికి ఆగస్టు 16, కొటేషన్ పత్రాలను సమర్పించడానికి ఆగస్టు 25 చివరి తేదీగా బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామాలు బీసీసీఐకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక పెద్ద సవాలుగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us