Team India: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రోహిత్ సేన ఢిల్లీకి చేరేది ఎప్పుడంటే.. కీలక అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ..

Special Flight For Team India to return from Barbados to New Delhi: భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్లందరూ ప్రస్తుతం తుఫాను కారణంగా బార్బడోస్‌లో చిక్కుకున్నారు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు నిర్ణీత సమయానికి స్వదేశానికి తిరిగి రాలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు బీసీసీఐ కీలక అప్ డేట్ ఇచ్చింది.

Team India: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రోహిత్ సేన ఢిల్లీకి చేరేది ఎప్పుడంటే.. కీలక అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ..
Team India

Updated on: Jul 02, 2024 | 1:30 PM

Special Flight For Team India to return from Barbados to New Delhi: భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్లందరూ ప్రస్తుతం తుఫాను కారణంగా బార్బడోస్‌లో చిక్కుకున్నారు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు నిర్ణీత సమయానికి స్వదేశానికి తిరిగి రాలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు బీసీసీఐ కీలక అప్ డేట్ ఇచ్చింది. భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ, ఇతర అధికారులు టీమ్ ఇండియాతోనే ఉంటున్నారు. దీంతో అందర్నీ ఒకేసారి తీసుకొచ్చేందుకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

జులై 3 సాయంత్రంలోగా ఢిల్లీకి రాన్నున్న టీమిండియా..

నివేదికల ప్రకారం, BCCI టీమిండియా కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఆటగాళ్లతో పాటు సభ్యులందరూ బార్బడోస్ కాలమాణం ప్రకారం సాయంత్రం 6 గంటలకు వారి దేశానికి వెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం జూలై 3వ తేదీ రాత్రి 7:45 గంటలకు టీమిండియా ఢిల్లీ చేరుకోనుందని సమాచారం.

తుఫాను కారణంగా, బార్బడోస్ విమానాశ్రయం మూసివేశారు. అన్ని విమానాలు రద్దు చేశారు. ఈ కారణంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరూ ఇప్పటికీ అక్కడే చిక్కుకున్నారు.

T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ కోసం రిజర్వ్ డే కూడా ఉంచారు. ఈ కారణంగా, సోమవారం ఇంటికి బయలుదేరాలని ఇరు జట్ల ప్రణాళిక. అయితే, తుఫాను కారణంగా, బార్బడోస్‌లోని విమానాశ్రయం ఇప్పుడు మూసివేశారు. దీని కారణంగా ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బంది, అధికారులు అందరూ అక్కడే చిక్కుకున్నారు.

నివేదికల ప్రకారం, తుఫాను చాలా వేగంగా బార్బడోస్‌ను తాకుతోంది. ఈ కారణంగా, భారత జట్టులోని ఆటగాళ్లందరూ వారి వారి హోటళ్లలో బస చేస్తారు. ఎవరినీ బయటకు వెళ్లనివ్వరు. అయితే ఇప్పుడు బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ఆటగాళ్లు, అధికారులందరినీ వెనక్కి తీసుకురావాలని ప్లాన్ చేసింది. ఢిల్లీలో టీమిండియాకు ఘనస్వాగతం లభించనుంది.

టీమ్ ఇండియాపై బీసీసీఐ కాసుల వర్షం..

టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ జై షా భారీ ప్రకటన చేసి, మొత్తం టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల రివార్డు ప్రకటించారు. ఈ విజయం కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా భారత జట్టులోని ఆటగాళ్లందరికీ జై షా అభినందనలు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..