IPL 2023: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫుట్‌బాల్ రూల్.. రంగంలోకి 12వ ప్లేయర్.. మారనున్న టీ20 స్వరూపం..

|

Dec 04, 2022 | 7:32 AM

Indian Premier League 2023: వచ్చే ఏడాది IPLలో ఫుట్‌బాల్ ఆటలో ఇప్పటికే ఉన్న ఓ నియమం వర్తిస్తుంది. ఇప్పుడు అన్ని జట్లు మ్యాచ్ సమయంలో 14వ ఓవర్ వరకు ఈ మార్పును ఉపయోగించుకోవచ్చు.

IPL 2023: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫుట్‌బాల్ రూల్.. రంగంలోకి 12వ ప్లేయర్.. మారనున్న టీ20 స్వరూపం..
Ipl 2023
Follow us on

Indian Premier League 2023: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ ఇన్నోవేషన్ ప్లేబుక్ నుంచి ఓ రూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి ఎడిషన్‌లో ఉపయోగించేందుకు ప్లాన్ చేసింది. అదే ఇంపాక్ట్ ప్లేయర్ నియమం. ప్రస్తుతం ఫుట్‌బాల్ లాగా ఐపీఎల్‌లో ప్లేయర్ సబ్‌స్టిట్యూషన్ కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్‌ను అమలు చేసేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ నియమం అమల్లోకి వచ్చిన తర్వాత, ఒక జట్టులో 12 మంది ఆటగాళ్ళు ఆడటం కనిపిస్తుంది. నిబంధనల ప్రకారం కేవలం 10 వికెట్లు మాత్రమే ఔట్ అవుతాయి. ఈ నిబంధనకు సంబంధించి బీసీసీఐ ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీలకు నోటీసులు పంపింది.

ఇంపాక్ట్ ప్లేయర్..

ఐపీఎల్ రాబోయే సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావిస్తోంది. ఇందులో టీ20 మ్యాచ్‌లో ఆట సందర్భాన్ని బట్టి జట్లు తమ ప్లేయింగ్ XI నుంచి ఓ సభ్యుడిని మార్చవచ్చు. ఈ మేరకు బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. బోర్డు ప్రకారం, త్వరలో కొత్త నియమాన్ని వివరంగా వెల్లడించనుంది. టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణతో కొత్త కోణాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని బీసీసీఐ అన్ని రాష్ట్ర సంఘాలకు పంపిన సర్క్యులర్‌లో రాసుకొచ్చింది. ఇది ఈ ఫార్మాట్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. వ్యూహాత్మక ప్రత్యామ్నాయం అలానే ఉంటుందని నివేదికలో చెబుతున్నారు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దీన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.

నియమం ఎలా ఉంటుంది?

మ్యాచ్ టాస్ సమయంలో, రెండు జట్ల కెప్టెన్ తలో నలుగురు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల పేర్లను ఇవ్వాలి. వీటిలో రెండు జట్లలోని ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు జట్లు ఒక్కో ఆటగాడిని భర్తీ చేయగలవు. కానీ, మైదానంలో ఎప్పుడూ 11 మంది ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. నిబంధనల ప్రకారం, భర్తీ చేసిన ఆటగాడు మొత్తం మ్యాచ్ ఆడతాడు. మ్యాచ్ నుంచి బెంచ్‌కు వెళ్లిన తర్వాత, భర్తీ చేసిన ఆటగాడు మైదానానికి తిరిగి రాలేడు. 14వ ఓవర్ వరకు ఇరు జట్లు ఆటగాళ్లను మార్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నియమం ఏమి చెబుతుంది?

టాక్టికల్ సబ్‌స్టిట్యూషన్ నియమం ద్వారా ఏదైనా ఆటగాడిని భర్తీ చేయవచ్చు. బ్యాటింగ్ చేసి ఔట్ అయినా.. సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చే ఆటగాడు తన బ్యాటింగ్ లేదా నిర్దేశించిన కోటాలో నాలుగు ఓవర్లు కూడా బౌల్ చేస్తాడు. ఒకవేళ ఔటైన బ్యాట్స్‌మన్ స్థానంలో ఒక ఆటగాడు వస్తే, మిగిలిన జట్టులోని మిగిలిన బ్యాటింగ్ ఆటగాళ్ళలో ఒకరు బ్యాటింగ్ వదిలివేయవలసి ఉంటుంది. ఇదే సంవత్సరంలో, ఈ నిబంధన ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో ఢిల్లీ తన ఆటగాడు హృతిక్ షోకీన్‌ను భర్తీ చేసింది. భారత్‌లో జరిగిన ఏ టీ20 టోర్నీలోనైనా ఇదే తొలి ప్రయోగంగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..