Test Cricket: 32 ఓవర్లలో 5 పరుగులు.. వరుసగా 21 మెయిడిన్లతో చరిత్ర సృష్టించిన భారత బౌలర్.. ఆ రికార్డులో ఒకే ఒక్కడు..
ఈ భారత బౌలర్ కెరీర్ మొత్తం చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతను 41 టెస్ట్ మ్యాచ్‌లలో మొత్తం 65 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేశాడు. అంటే 9165 బంతులు బౌల్ చేశాడు. అందులో అతని ఎకానమీ రేటు 1.67గా నిలిచింది.
క్రికెట్ ఆటలో పరుగులు, సెంచరీలకు ఎంత ప్రాముఖ్యత ఉందో వికెట్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఒక బౌలర్ ఎన్ని వికెట్లు తీశాడో, అది మ్యాచ్ గమనాన్ని నిర్ణయించడమే కాకుండా, ఆ బౌలర్‌కు ఉన్నత స్థాయిని కల్పించడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. అయితే, బౌలర్‌ను ప్రభావవంతంగా మార్చడానికి వికెట్ మాత్రమే కాదు, మరొక అంశం కూడా కీలకపాత్ర వహిస్తుంది. ఇది అతని ఎకానమీ అంటే ఆ బౌలర్ ఎన్ని పరుగులు ఇచ్చాడో తెలియజేస్తుంది. క్రికెట్ చరిత్రలో ఎకనామిక్ బౌలింగ్‌కు వందలాది ఉదాహరణలు ఉన్నాయి. అయితే అనేక దశాబ్దాల తర్వాత కూడా ఒక రికార్డు అందుబాటులో లేదు. ఈ రోజు భారత మాజీ స్పిన్నర్ బాపు నాదకర్ణి సృష్టించారు.
భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ రమేష్‌చంద్ర గంగారామ్ నాదకర్ణి తన ఖచ్చితమైన లైన్ అండక లెంగ్త్ బౌలింగ్‌కు పేరుగాంచాడు. బౌలింగ్ పకడ్బందీగా ఉండడంతో బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేంది. నాదకర్ణి పరుగుల కరవును సృష్టించేవాడు. సరిగ్గా 59 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లకు పరుగులు చేయడం కష్టంగా మారిన రోజును ఇప్పుడు తెలుసుకుందాం..
59 ఏళ్లుగా రికార్డు..
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య 1964 జనవరి 10న చెన్నై (అప్పటి మద్రాస్)లో ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ మూడో రోజు అంటే జనవరి 12న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది. అప్పటి వరకు ఎవరూ చేయలేని అద్భుతం జరిగింది. బాపు నాదకర్ణి ఒక ఎండ్ నుంచి బౌలింగ్ బాధ్యతలు స్వీకరించి ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌కు డిజాస్టర్‌గా కనిపించాడు.
ఒక్కసారి నాదకర్ణి మెయిడిన్ ఓవర్ వేయడం ప్రారంభించిన తర్వాత అతన్ని ఆపడం కష్టంగా మారింది. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ల ముందు భారత స్పిన్నర్ మొత్తం వరుసగా 21 ఓవర్లు మెయిడెన్‌లు సంధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
మొత్తం 32 ఓవర్ల బౌలింగ్‌లో 27 మెయిడిన్లు ఇవ్వగా, ఐదు ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అతను వికెట్‌ను పడగొట్టలేకపోయాడు. కానీ మిగిలిన బౌలర్లు వికెట్లు తీయడం ద్వారా నాదకర్ణి సృష్టించిన ఒత్తిడిని సద్వినియోగం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అతనికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మొత్తం 6 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ 6 ఓవర్లలో కూడా బ్యాట్స్‌మన్ 6 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో 4 మెయిడిన్లు బౌలింగ్ చేశాడు.
కెరీర్ మొత్తం ఎకానమీ చూస్తే బ్యాటర్లకు దడే..
నాదకర్ణి కెరీర్ మొత్తం చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతను 41 టెస్ట్ మ్యాచ్‌లలో మొత్తం 65 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేశాడు. అంటే 9165 బంతులు బౌల్ చేశాడు. అందులో అతని ఎకానమీ రేటు 1.67గా నిలిచింది. 88 వికెట్లు తీశాడు. మరోవైపు, మొత్తం ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో, నాదకర్ణి 38913 బంతులు వేశాడు. అందులో అతని ఎకానమీ 1.64 మాత్రమే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..