సహచరులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు మన రన్‌మెషిన్ కింగ్ కోహ్లీ. అతను కెప్టెన్సీ చేస్తున్న సమయంలోనే ఇది చాలాసార్లు నిరూపితమైంది. ఆటగాళ్లు బాగా ఆడితే మరింత వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు విరాట్. ఒకవేళ విఫలమైతే మాత్రం ఏం కాదులే బ్రదర్ అంటూ ధైర్యం చెబుతాడు. ఇక బౌలర్లు వికెట్లు తీసినప్పుడు, తోటి బ్యాటర్లు సెంచరీలు కొట్టినప్పుడైతే సెలబ్రేషన్స్ షేర్ చేసుకోవడంతో ముందుంటాడీ టీమిండియా మాజీ కెప్టెన్. తాజాగా అలాంటిదే మరొకటి బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో చోటుచేసుకుంది. చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ వేసిన 35వ ఓవర్ చివరి బంతికి అతను సింగిల్ తీయగానే, స్టేడియం మొత్తం హోరెత్తింది. టీమిండియా క్రికెటర్లతో పాటు మేనేజ్‌మెంట్ బృందం లేచి నిలబడి ఇషాన్‌కు అభివాదం తెలిపారు. ఇక ఇషాన్ కూడా హెల్మెట్‌ను తీసేసి తన డబుల్ సెంచరీ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇదే సమయంలో మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కూడా ఇషాన్ డబుల్ సెంచరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా పిచ్ మధ్యలోనే భాంగ్రా డ్యాన్స్ చేస్తూ కిషాన్‌కు కంగ్రాట్స్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా మూడో వన్డేలో ఇషాన్ 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ తన తొలి 100 పరుగులను 85 బంతుల్లో పూర్తి చేయగా, తర్వాతి 100 పరుగులు కేవలం 41 బంతుల్లోనే సాధించడం విశేషం. కాగా ఈ మ్యాచ్ తో ప్రపంచంలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఇషాన్ నిలిచాడు. అతను 126 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇక మూడో వన్డేలో విరాట్ కోహ్లి కోహ్లీ కూడా గర్జించాడు. బంగ్లాదేశ్ బౌలర్లను చిత్తు చేయడంలో ఇషాన్‌కు తనవంతు సహాయం చేశాడు. కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే క్రికెట్‌లో మూడేళ్ల నిరీక్షణ తర్వాత కోహ్లి బ్యాట్ నుంచి సెంచరీ జాలువారడం విశేషం. ఇది అతనికి 44వ వన్డే, 72వ అంతర్జాతీయ సెంచరీ. తాజాగా ఈ సెంచరీతో రికీ పాంటింగ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు కోహ్లి. అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో 100 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
200 for @ishankishan51 ?
Well played KishanBhangra Celebration by VIRAT KOHLI❤️@imVkohli #viratkohli pic.twitter.com/jPpbAorCvy
— NAMAN (@NamanMiglani1) December 10, 2022
.@ishankishan51 scored a breathtaking Double Ton & was our Top Performer from the first innings of the third #BANvIND ODI ? ?
A summary of his stunning batting display ? #TeamIndia pic.twitter.com/FJVryOnN1J
— BCCI (@BCCI) December 10, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..