ENG Vs PAK: ఒరేయ్ ఆజామూ.! ఎంత పని జరిగింది.. ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే

|

Oct 15, 2024 | 6:07 PM

ఒరేయ్ ఆజామూ.! ఎంత పని జరిగింది.! ఇక జట్టులో నీ ప్లేస్ ఊస్టే అంటున్నారు ఫ్యాన్స్. ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో బాబర్ ఆజామ్ స్థానంలో వచ్చిన క్రమాన్ గులామ్ అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదేశాడు. ఆ వివరాలు..

ENG Vs PAK: ఒరేయ్ ఆజామూ.! ఎంత పని జరిగింది.. ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే
Eng Vs Pak
Follow us on

తొలి టెస్టు మ్యాచ్.. అందులోనూ తొలి సెంచరీ.. ఈ ఫీట్ ప్రతీ ఒక్క క్రికెటర్ కలలు కంటాడు. ఇప్పుడు పాకిస్తాన్‌ క్రికెటర్ అదే సాధించాడు. బాబర్ ఆజామ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి.. పాక్ జట్టును ఆదుకున్నాడు. దాదాపుగా ఐదేళ్ల తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఓ బ్యాట్స్‌మెన్ అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించడం విశేషం. ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు..తొలి సెషన్‌లోనే పాకిస్థాన్‌ కష్టాల్లో పడింది. ఆ జట్టు 10 ఓవర్లలోపే అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో కమ్రాన్ గులామ్ క్రీజులోకి దిగాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే తన దూకుడైన ఆటతీరుతో అందరినీ అబ్బురపరిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 15వ బంతికే సిక్సర్ కొట్టి.. అనుభవమున్న సీనియర్ ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ తర్వాత గులామ్ 104 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు ఈ ఆటగాడు సామ్ అయ్యూబ్‌తో కలిసి మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సామ్ అయూబ్ 77 పరుగుల వద్ద తన వికెట్ కోల్పోయాడు.

ఇది చదవండి:  ఇక మొదలెడదామా.! కివీస్‌ టెస్టు సిరీస్ టూ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు.. టీమిండియా రాబోయే షెడ్యూల్ ఇది

ఇవి కూడా చదవండి

కమ్రాన్ గులామ్ 192 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. మొత్తంగా 224 బంతులు ఎదుర్కున్న కమ్రాన్.. 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 118 పరుగులు చేశాడు. ఈ ఆటగాడు 2023లో పాకిస్తాన్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అతను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రంగంలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో హరీస్ సొహైల్ గాయపడ్డాడు. కానీ కమ్రాన్ గులామ్‌కి బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. దీని తర్వాత, ఈ ఆటగాడికి మళ్ళీ పాకిస్థానీ జట్టులోకి రావడానికి అవకాశం రాలేదు.

అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేసిన 13వ పాక్‌ బ్యాట్స్‌మెన్‌ కమ్రాన్‌ గులామ్‌. అలాగే, పాకిస్థాన్‌లో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడు. ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్రం టెస్టులో సెంచరీ సాధించిన తొలి పాకిస్థానీ ఆటగాడు కమ్రాన్. 23 ఏళ్ల తర్వాత ముల్తాన్ గడ్డపై అరంగేట్రం టెస్టులో ఓ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించడం విశేషం.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..