AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s T20 WC 2026: ఎన్ని సార్లు గెలుస్తారమ్మా.. బోర్ కొట్టడం లేదా? ఆసీస్‌కి ఇది ఎన్నో కప్పో తెలుసా?

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు 2026 టీ20 ప్రపంచకప్‌ను గెలిచి, మొత్తం 14 ఐసీసీ ట్రోఫీలు (7 వన్డే, 7 టీ20 ప్రపంచకప్‌లు) సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల క్రికెట్‌లో వారి ఆధిపత్యం తిరుగులేనిది. వారి విజయానికి అద్భుతమైన ఆట కారణమా, లేక ఇతర జట్ల వైఫల్యమా అనేది చర్చనీయాంశం.

Women's T20 WC 2026: ఎన్ని సార్లు గెలుస్తారమ్మా.. బోర్ కొట్టడం లేదా? ఆసీస్‌కి ఇది ఎన్నో కప్పో తెలుసా?
Icc Women's T20 World Cup 2
SN Pasha
|

Updated on: Jul 06, 2026 | 10:07 AM

Share

పెద్దగా సంచలనం ఏం జరగలేదు.. అంతా అనుకున్నదే అయింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని గెలిచేసింది. క్రికెట్ చరిత్రలో ఇంకా ఒక్క వన్డే, టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోయిన టీమ్స్ చాలా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌‌పై తమదైన ముద్ర వేసిన జట్లు కూడా ఐసీసీ కప్పులను ముద్దాడేందుకు తహతహలాడుతున్నాయి. అలాంటిది ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ మాత్రం.. మంచినీళ్లు తాగినంత సులభంగా ఐసీసీ ట్రోఫీలు గెలిచేస్తున్నారు. అసలు వారి సక్సెస్ వెనుకు వారి అద్భుతమైన ఆటా? లేక మిగతా జట్ల వైఫల్యమా? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా.. మెన్స్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా డామినేషన్ తగ్గినప్పటికీ.. ఉమెన్స్ క్రికెట్‌లో మాత్రం వాళ్లకు తిరుగులేకుండా పోయింది.

ఇప్పటి వరకు ఎన్ని ట్రోఫీలు గెలిచారంటే..?

ఐసీసీ కప్పులు గెలవడం ఒక అలవాటుగా మార్చుకున్న ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్.. 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌ గెలుపుతో టీమ్ మొత్తం 14 ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఘనతను అందుకుంది. ఇందులో 7 వన్డే ప్రపంచకప్‌లు, 7 టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలో ఇంతటి విజయవంతమైన జట్టు మరొకటి లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

1978లో తొలి టైటిల్ గెలిచిన ఆ జట్టు, ఆ తర్వాత 1982, 1988, 1997, 2005, 2013, 2022లోనూ విజేతగా నిలిచి మొత్తం ఏడు సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రపంచ మహిళల వన్డే క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియా అదే జోరు కొనసాగించింది. 2010లో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టు, 2012, 2014, 2018, 2020, 2023, తాజాగా 2026లోనూ టైటిల్ సాధించి ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు వరుసగా నాలుగు టీ20 ప్రపంచకప్‌లు గెలవడం వారి డామినేషన్‌కు నిదర్శనం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎన్ని సార్లు గెలుస్తారమ్మా.. బోర్ కొట్టడం లేదా?
ఎన్ని సార్లు గెలుస్తారమ్మా.. బోర్ కొట్టడం లేదా?
కుక్క కరిచిన వెంటనే ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్..
కుక్క కరిచిన వెంటనే ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్..
అమెరికా ఒత్తిళ్లు.. ఇరాన్ కృతజ్ఞతలు.. ఇజ్రాయెల్ ప్రశంసలు.. 
అమెరికా ఒత్తిళ్లు.. ఇరాన్ కృతజ్ఞతలు.. ఇజ్రాయెల్ ప్రశంసలు.. 
కలియుగ వైకుంఠంలో అద్భుతం.. 116 ఏళ్ల వృద్ధురాలి భక్తికి కరిగిన..
కలియుగ వైకుంఠంలో అద్భుతం.. 116 ఏళ్ల వృద్ధురాలి భక్తికి కరిగిన..
ఒక చిన్న పొరపాటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది!
ఒక చిన్న పొరపాటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది!
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది..
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది..
చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. ధోని ఫ్రాంచైజ్ టీమ్ ఓటమి!
చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. ధోని ఫ్రాంచైజ్ టీమ్ ఓటమి!
ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్
ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్
మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి..
మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి..
స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?
స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?