ఆస్ట్రేలియా జట్టు రెగ్యులర్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతని మాతృమూర్తి మారియా శుక్రవారం (మార్చి 10) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా తన తల్లిని చూసుకోవడం కోసమే బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయాడు కమిన్స్. తొలి రెండు టెస్లుల్లో జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతను తల్లి అనారోగ్యం బారిన పడడడంతో మూడు, నాలుగు టెస్టుల నుంచి వైదొలిగాడు. కాగా తన తల్లి ఆఖరి ఘడియల్లో ఆమె వెంటే ఉన్నాడు కమిన్స్.
దాదాపు 20 రోజులు ఆస్పత్రిలోనే గడిపాడు. ఈ క్రమంలో క్రికెట్ కంటే కూడా తల్లికే ప్రాధాన్యమిచ్చన కమిన్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. అయితే చివరికి ఆ తల్లి తుదిశ్వాస విడవడంతో కమిన్స్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఆసీస్ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు కమిన్స్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ విషాదం నుంచి కమిన్స్ ఫ్యామిలీ వీలైనంత త్వరగా బయటపడాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు
కాగా కమిన్స్ తల్లి మృతికి సంతాపంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్లబ్యాడ్జీలు ధరించి మైదానంలోకి దిగారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆసీస్ ఆటగాళ్లంతా నల్లబ్యాడ్జీలతో కనిపించారు. తద్వారా తమ కెప్టెన్‌కు ఈ విషాద సమయంలో అండగా ఉన్నామని తెలిపేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాగా పాట్ కమిన్స్ ప్రస్తుతం ఇండియాకు తిరిగి రావడం చాలా కష్టం. దీంతో భారత్‌తో త్వరలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు స్టీవ్ స్మిత్‌నే సారధిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది.
Our deepest condolences to Pat Cummins and his family, our thoughts are with you all during this time.
?: Pat Cummins/Instagram#CricTracker #PatCummins #INDvAUS #BGT pic.twitter.com/JeSr4VWpdb
— CricTracker (@Cricketracker) March 10, 2023
Australia’s Test players wore black armbands on the second day against India in honour of captain Pat Cummins’ mother, who has died after battling a prolonged illness. pic.twitter.com/xzxQ2vUVG6
— Cricket on BT Sport (@btsportcricket) March 10, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..