
Australia vs South Africa, 7th Match, Group B: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా 7వ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రావల్పిండి స్టేడియంలో జరుగుతుంది. ప్రస్తుతం వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఈ రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి. వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఈరోజు ఇక్కడ వర్షం పడే అవకాశాలు 67% ఉన్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తమ తొలి మ్యాచ్‌లను గెలిచిన తర్వాత రెండు జట్లు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ను ఓడించగా, దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది.
రెండు జట్లు తమ మొదటి మ్యాచ్‌ల్లో గెలిచాయి. దీంతో రెండు జట్లకు తలో 2 పాయింట్లు ఉన్నాయి. కానీ, మెరుగైన రన్ రేట్ కారణంగా దక్షిణాఫ్రికా గ్రూప్-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-బిలో బలమైన స్థానాన్ని పొందుతుంది.
మొత్తం మీద వన్డేల్లో దక్షిణాఫ్రికా ముందంజలో ఉంది. రెండు జట్లు 110 సార్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా జట్టు 55 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆస్ట్రేలియా 51 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌లు టై అయ్యాయి, 1 మ్యాచ్ ఫలితం నిర్ణయించబడలేదు.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షిస్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా.
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, వేన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి న్గిడి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..