
కొన్నిసార్లు క్రికెట్ గ్రౌండ్‌లో ఇచ్చే ప్రదర్శనలు చరిత్రను తిరగరాస్తాయి. మాజీ ఆస్ట్రేలియా అండర్-19 ఆటగాడు హర్జాస్ సింగ్ అసాధారణమైన ఘటన సాధించాడు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్‌లో అతడు అందరినీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వెస్ట్రన్ సబర్బ్స్ తరపున ఆడుతున్న ఈ బ్యాట్స్‌మెన్ సిడ్నీ క్రికెట్ క్లబ్‌తో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ అక్టోబర్ 4, 2025న ప్రాటెన్ పార్క్‌లో జరిగింది. ఇందులో వెస్ట్రన్ సబర్బ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. జట్టుకు ఓపెనర్లు ఇద్దరూ మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 10వ ఓవర్‌లో కట్లర్ అవుట్ కాగా.. హర్జాస్ సింగ్ మూడో స్థానంలో బరిలోకి దిగాడు. క్రీజులోకి వచ్చిన ఫస్ట్ బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో 33 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత తన పేలుడు ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కేవలం 141 బంతుల్లో 314 పరుగులు చేశాడు.
హర్జాస్ సింగ్ తన సెంచరీని చేరుకోవడానికి 74 బంతులు తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుసగా సిక్సర్లతో ఊచకోత కోశాడు. కేవలం 103 బంతుల్లోనే అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఆపై 29 బంతుల్లోనే మరో సెంచరీని పూర్తి చేసి.. మొత్తంగా 132 బంతుల్లో 301 పరుగులు చేశాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో 34 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. హర్జాస్ సింగ్ ట్రిపుల్ సెంచరీతో.. వెస్ట్రన్ సబర్బ్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 483 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 2024లో ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో, హర్జాస్ సింగ్ అర్ధసెంచరీతో ఆస్ట్రేలియాను ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో హర్జాస్ సింగ్ 64 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసి ఆస్ట్రేలియాను 253 పరుగులు చేయడంలో సహాయపడ్డాడు. హర్జాస్ సింగ్‌కు భారత్‌తో ప్రత్యేక బంధం ఉంది. అతని కుటుంబం 24 సంవత్సరాల క్రితం చండీగఢ్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చింది.
ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్
Dead set carnage from Harjas Singh for Wests today. https://t.co/i6CjWS03K1 pic.twitter.com/vyTnwzWRma
— Tom Decent (@tomdecent) October 4, 2025