AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రోహిత్‌కు ఒక్క ఏడాది ఇవ్వలేకపోయాం..! భారత సెలెక్టర్లపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఫైర్‌

టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించి శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ నియమించింది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు కష్టమని అగార్కర్ వివరించారు. అయితే 16 ఏళ్లు దేశానికి సేవలందించిన రోహిత్‌కు ఏడాది కూడా ఇవ్వలేకపోయామని, ఐసీసీ టోర్నీల్లో అతని విజయాలను గుర్తించలేదని కైఫ్ అభిప్రాయపడ్డారు.

Rohit Sharma: రోహిత్‌కు ఒక్క ఏడాది ఇవ్వలేకపోయాం..! భారత సెలెక్టర్లపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఫైర్‌
Rohit
SN Pasha
|

Updated on: Oct 05, 2025 | 9:26 AM

Share

టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విషయంలో బీసీసీఐ, భారత సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా తప్పిస్తూ.. అతని స్థానంలో యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించారు. ఇప్పటికే గిల్‌ టెస్టు జట్టు కెప్టెన్‌గా కూడా ఉ‍న్న విషయం తెలిసిందే. అయితే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా ఉంచాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

కానీ, రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తప్పించడంపై భారత జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండే కష్టమని, అందుకే గిల్‌కు వన్డే కెప్టెన్సీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇది వ్యూహత్మక నిర్ణయమని అన్నాడు. అయితే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ స్పందిస్తూ.. రోహిత్‌ శర్మ భారత క్రికెట్‌కు 16 ఏళ్లు ఇస్తే.. మనం అతనికి ఒక్క ఏడాది కూడా ఇవ్వలేకపోయాం అని అన్నాడు.

రోహిత్‌ శర్మ దేశం కోసం 2024లో టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచాడు. ఆ వెంటనే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇదే ఏడాది కెప్టెన్‌గా ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా అందించాడు. ఆ టోర్నీ చివరి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మనే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మొత్తం 16 ఐసీసీ మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా 15 మ్యాచ్‌లు గెలిచాడు. ఓడిన ఆ ఒక్క మ్యాచ్‌ కూడా 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌. అలాంటి రోహిత్‌కు మరో ఏడాది కెప్టెన్‌గా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!