- Telugu News Sports News Cricket news Australia Player Glenn Maxwell Breaks Rohit Sharma's Sixer Record in Chasing
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డ్‌నే మడతెట్టేసిన కంగారోడు.. ఛేజింగ్‌లో చెమటలు పట్టిస్తున్నాడుగా..
Glenn Maxwell Records: దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా తుఫాన్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుతంగా రాణించాడు. మూడో టీ20లో అజేయంగా 62 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా 2-1 సిరీస్ విజయంలో మాక్స్వెల్ కీలక పాత్ర పోషించాడు. ఈ విజయ ఇన్నింగ్స్‌తో మాక్స్వెల్ కొన్ని రికార్డులను కూడా సృష్టించాడు.
Updated on: Aug 18, 2025 | 6:41 PM

Glenn Maxwell Records: ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్‌మన్ గ్లెన్ మాక్స్‌వెల్ టీ20 క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అది కూడా హిట్‌మ్యాన్ ఫేమ్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించిన మాక్స్‌వెల్ 36 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్లతో అజేయంగా 62 పరుగులు చేశాడు.

ఈ రెండు సిక్సర్లతో, గ్లెన్ మాక్స్వెల్ T20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో, ఈ రికార్డు టీం ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది.

టీ20 మ్యాచ్‌లో ఛేజింగ్ చేస్తూ రోహిత్ శర్మ 52 ఇన్నింగ్స్‌లలో 63 సిక్సర్లు కొట్టాడు. దీంతో, టీ20 క్రికెట్‌లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు, గ్లెన్ మాక్స్‌వెల్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు.

ఆస్ట్రేలియా తరపున మిడిల్ ఆర్డర్‌లో ఆడే గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పటివరకు 44 ఇన్నింగ్స్‌లలో చేజింగ్‌లో బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో 64 సిక్సర్లు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో, అతను సిక్సర్ కింగ్ ఆఫ్ చేజింగ్‌గా రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో 62 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గ్లెన్ మాక్స్‌వెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు ఆస్ట్రేలియా తరపున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న రికార్డును మాక్స్‌వెల్ సమం చేశాడు. డేవిడ్ వార్నర్, మాక్స్‌వెల్ ఇప్పుడు ఈ జాబితాలో 12 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో అగ్రస్థానంలో ఉన్నారు.




