Watch Video: జిమ్‌లో రౌడీలను చితకబాదిన డేవిడ్ వార్నర్.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ వీడియో

|

Feb 25, 2023 | 7:48 PM

భారత్‌తో 4 టెస్టుల సిరీస్‌లో మొదటి 2 టెస్టు మ్యాచ్‌లు ఆడిన తర్వాత డేవిడ్ వార్నర్ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. రెండో టెస్టులో గాయపడడంతో సిరీస్‌కు దూరమయ్యాడు.

Watch Video: జిమ్‌లో రౌడీలను చితకబాదిన డేవిడ్ వార్నర్.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ వీడియో
David Warner
Follow us on

డేవిడ్ వార్నర్ జిమ్‌లో దాదాపు డజను మంది రౌడీలను చితకబాదాడు. వాళ్లతో ఫైట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఫ్యాన్స్ ఈ వీడియో చూసి నోరెళ్లబెడుతున్నారు. ఫన్నీ కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆ తర్వాత ఈ ఫైట్ వీడియో అసలు కథ బయటకు వచ్చింది. నిజానికి ఈ వీడియో సౌత్ సూపర్‌స్టార్ విక్రమ్ సూపర్‌హిట్ మూవీలో ఒక సన్నివేశం. ఇందులో విక్రమ్ ఫేస్‌కు బదులు వార్నర్ తన ఫేస్‌ను ఉంచాడు.

ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ, ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ నాకు ఇష్టమైన సినిమాల్లో ఇది ఒకటి అంటూ.. ఆ సినిమా పేరుని చెప్పాలంటూ అభిమానులను ప్రశ్నించాడు. భారత్‌తో వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. తరచుగా భారతీయ చిత్రాల గురించి తన కుటుంబంతో కలిసి రీల్స్ తయారు చేస్తూ ఉంటాడు. గతంలో కూడా షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ సినిమాల్లోని కొన్ని ప్రత్యేక సన్నివేశాలపై రీల్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

బ్యాట్‌తో వార్నర్ ఫ్లాప్..

ఇటీవల, డేవిడ్ వార్నర్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. 4 టెస్టుల సిరీస్ కోసం భారత్‌ వచ్చాడు. అయితే, రెండు టెస్టుల్లోనూ ఫ్లాప్ అయ్యాడు. అతని బ్యాట్ నుంచి పరుగల వర్షం రాలేదు. వార్నర్ తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 పరుగులు, రెండో టెస్టులో 15 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో మోచేయికి గాయం కావడంతో, సిరీస్ మధ్యలో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

త్వరలో తిరిగి ఐపీఎల్‌లోకి..

వార్నర్ వీలైనంత త్వరగా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. IPL 2023 వచ్చే నెల నుంచి మొదలుకానుంది. రిషబ్ పంత్ లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రిషబ్ పంత్ కొంతకాలంగా రోడ్డు ప్రమాదానికి గురై కొద్దిరోజుల క్రితం ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను పూర్తిగా ఫిట్‌గా మారడానికి చాలా సమయం పడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..