AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

W,W,W.. హ్యాట్రిక్‌‌తో చెలరేగిన గోల్ కీపర్.. కట్‌చేస్తే.. క్రికెట్ హిస్టరీలోనే స్పెషల్ జాబితాలో ఎంట్రీ..

WBBL hat-trick: ఆస్ట్రేలియా అండర్-17 ఫుట్‌బాల్ జట్టు గోల్ కీపర్ కుయివా బ్రే తన క్రికెట్ కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విధానం చాలా ప్రత్యేకమైనది. 16 ఏళ్ల కుయివా బ్రే WBBL పిచ్‌పై ఓ ప్రత్యేక ఘనత సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు క్రికెటర్లలో ఒకరిగా నిలబెట్టడమే కాకుండా, అతి పిన్న వయస్కురాలిగా కూడా నిలిచింది.

W,W,W.. హ్యాట్రిక్‌‌తో చెలరేగిన గోల్ కీపర్.. కట్‌చేస్తే.. క్రికెట్ హిస్టరీలోనే స్పెషల్ జాబితాలో ఎంట్రీ..
Caiomhe Bray
Venkata Chari
|

Updated on: Nov 18, 2025 | 12:42 PM

Share

Caiomhe Bray: క్రికెట్ మైదానంలో ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి తనదైన ముద్ర వేసి ఔరా అనిపించింది. దీంతో ఎంఎస్ ధోని, ఎల్లీస్ పెర్రీల సరసన చేరింది. ఆస్ట్రేలియా అండర్-17 ఫుట్‌బాల్ జట్టు గోల్ కీపర్ కుయివా బ్రే తన క్రికెట్ కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విధానం చాలా ప్రత్యేకమైనది. 16 ఏళ్ల కుయివా బ్రే WBBL పిచ్‌పై ఓ ప్రత్యేక ఘనత సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు క్రికెటర్లలో ఒకరిగా నిలబెట్టడమే కాకుండా, అతి పిన్న వయస్కురాలిగా కూడా నిలిచింది.

WBBL లో హ్యాట్రిక్..

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, కుయివా బ్రే ఏమి చేసింది? ఈ 16 ఏళ్ల క్రీడాకారిణి WBBL లో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ఆస్ట్రేలియన్ మహిళల టీ20 లీగ్‌లో ఆమె 7వ క్రికెటర్ అయినప్పటికీ, WBBLలో హ్యాట్రిక్ సాధించిన ఏడుగురు క్రీడాకారిణులలో ఆమె అతి పిన్న వయస్కురాలు కావడం గమనార్హం. కుయివా బ్రే కంటే ముందు, నికోల్ బోల్టన్, గెమ్మ ట్రిస్కారి, అమీ సాటర్త్‌వైట్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, డార్సీ బ్రౌన్ కూడా WBBLలో హ్యాట్రిక్ సాధించింది.

గాయంతో ఫుట్‌బాల్‌, క్రికెట్‌కు విరామం..

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎల్లీస్ పెర్రీ మాదిరిగానే, కుయివా బ్రే కూడా ద్వంద్వ-క్రీడా అథ్లెట్‌గా ఎదుగుతోంది. ఒక గాయం ఆమె ఫుట్‌బాల్ కెరీర్‌కు బ్రేకులు వేసింది. దీంతో క్రికెట్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె ఆస్ట్రేలియన్ మహిళల టీ20 లీగ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. సిడ్నీ సిక్సర్స్‌తో మూడు సంవత్సరాల ఒప్పందం ఆమె ఫుట్‌బాల్ కెరీర్‌కు నాంది పలికింది. గోల్ కీపర్‌గా ఆమె కెరీర్‌కు నాంది పలికింది.

ఇవి కూడా చదవండి

సిడ్నీ సిక్సర్స్ ఆల్ రౌండర్‌గా..

ఫుట్‌బాల్ గోల్ కీపర్ కుయివా బ్రే క్రికెట్‌లో ఆల్ రౌండర్. సిడ్నీ సిక్సర్స్‌తో ఆమె ఒప్పందం గత సీజన్‌లో ప్రారంభమైంది. ఆమె మొదటి సీజన్‌లో, ఆమె WBBLలో 10 మ్యాచ్‌లు ఆడి, 10 వికెట్లు పడగొట్టి, 37 పరుగులు చేసింది. అయితే, మహిళల బిగ్ బాష్ లీగ్‌లో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

నవంబర్ 15న సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో కుయివా బ్రే తన WBBL హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. ఆమె జట్టు కెప్టెన్ లిచ్‌ఫీల్డ్, అనికా లియరాయిడ్, లారా హారిస్‌లను అవుట్ చేసి తన హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. 16 ఏళ్ల కుయివా బ్రే ఫుట్‌బాల్, క్రికెట్ రెండింటినీ ఆడాలని కోరుకుంటుంది. ఎల్లీస్ పెర్రీ లాగానే, ఆమె రెండు క్రీడలలోనూ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..