IND vs AUS: టీమిండియాతో మూడో టెస్ట్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్‌గా ఎవరంటే?
నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టుల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఇండోర్ టెస్టుకు ముందు మరో బ్యాడ్ న్యూస్ అందుకుంది. పాట్ కమిన్స్ మూడో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు.

డబ్ల్యూటీసీలో అగ్రస్థానంలో భారత్ చేరిన ఆస్ట్రేలియా జట్టుకు.. వరుసగా రెండు ఓటములతో ఫైనల్ నుంచి తప్పుకునే ప్రమాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలో నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టుల్లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియాకు ఇప్పుడు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఢిల్లీ టెస్టు తర్వాత పాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. పాట్ కమిన్స్ తల్లి ఆరోగ్యం విషమంగా ఉందంట. అయితే, ఇండోర్ టెస్టుకు ముందు పాట్ కమిన్స్ జట్టులోకి వస్తాడని ముందుగా భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితితో ఇండోర్ మ్యాచ్‌లో ఆడడంలేదు.
పాట్ కమిన్స్ తల్లి ఆరోగ్యం మరింత దిగజారింది. ఈ మేరకు కమిన్స్ ఒక ప్రకటన చేస్తూ, ప్రస్తుతం భారతదేశానికి తిరిగి రాలేనని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో అతను తన కుటుంబంతో ఉండాల్సిన సమయం అని కమిన్స్ ప్రకటించాడు. సపోర్ట్ చేసిన టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపాడు.
కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..
పాట్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియన్ జట్టుకు బాధ్యతలు నిర్వహించనున్నాడు. అంతకుముందు సారథిగా స్టీవ్ స్మిత్ ఉన్న సంగతి తెలిసిందే. ఇసుక పేపర్ వివాదం కారణంగా స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ వివాదం తర్వాత తిరిగి వచ్చినప్పటి నుంచి, అతను రెండుసార్లు జట్టు కమాండ్‌ను చేపట్టాడు. మార్చి 1 నుంచి ఇండోర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరగనుంది. టెస్టు సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. విజయం సాధిస్తే సిరీస్ గెలవడమే కాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధిస్తుంది.
గాయల బారిన ఆస్ట్రేలియా టీం..
గాయం కారణంగా ఆస్ట్రేలియా జట్టులోని చాలా మంది ఆటగాళ్ళు స్వదేశానికి తిరిగి వెళ్లారు. మోచేయి గాయం కారణంగా డేవిడ్ వార్నర్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. హాజిల్‌వుడ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మాథ్యూ రెన్షా కూడా గాయం కారణంగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. అష్టన్ అగర్ కూడా జట్టు నుంచి విడుదలయ్యాడు. ఇప్పుడు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆడలేకపోవడం ఈ జట్టుకు చాలా బ్యాడ్ టైం నడుస్తోంది.
కాగా, మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు కూడా శుభవార్త అందింది. గాయం కారణంగా తొలి రెండు టెస్టుల్లో చోటుదక్కని కెమరూన్ గ్రీన్.. ప్రస్తుతం తిరిగి జట్టులోకి రావొచ్చని తెలుస్తోంది. తాను 100 శాతం ఫిట్‌గా ఉన్నానని, ఇండోర్ టెస్టులో ఆడగలనని గ్రీన్ చెప్పుకొచ్చాడు. మిచెల్ స్టార్క్ కూడా ఇండోర్‌లో ఆడే అవకాశం ఉంది.
