AUS vs PAK: బీజీటీకి ముందే ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. గాయంతో ఫ్యూచర్ స్టార్ ఔట్..

|

Nov 10, 2024 | 7:49 PM

Australia All Rounder Cooper Connolly: భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు, పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు డబుల్ ఓటమితోపాటు ఓ ఆటగాడిని కూడా మిస్ కావాల్సి వచ్చింది. ఓ యువ ప్లేయర్ గాయపడడంతో ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది.

AUS vs PAK: బీజీటీకి ముందే ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. గాయంతో ఫ్యూచర్ స్టార్ ఔట్..
Wtc Final 2025 Ind Vs Aus
Follow us on

Australia All Rounder Cooper Connolly: భారత్‌తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు, పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు డబుల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో స్వదేశంలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఓ ఆసీస్ ఆటగాడు కూడా గాయపడ్డాడు. ఎమర్జింగ్ ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీ ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయింది. దీంతో పాక్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని భర్తీని త్వరలో ప్రకటించనున్నారు. పెర్త్‌లో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో మహ్మద్ హస్నైన్ బంతికి కొన్నోలీ గాయపడ్డాడు. ఈ కారణంగా అతను రిటైర్ అయ్యాడు. అనంతరం స్కానింగ్‌ చేసి ఫ్రాక్చర్‌ని నిర్ధారించారు.

కొన్నోలీ గాయం ఆస్ట్రేలియా క్రికెట్‌కు తీరని లోటు. 2026 టీ20 ప్రపంచకప్‌నకు ముందు అతనికి అంతర్జాతీయంగా ఎక్కువ అనుభవాన్ని అందించాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరుకుంటోంది. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియాలో ఇలాంటి ఆటగాళ్లు చాలా తక్కువ.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ 17వ ఓవర్ రెండో బంతికి గాయమైంది. అతను పుల్ షాట్ ఆడాలనుకున్నాడు. కానీ, హస్నైన్ వేసిన బంతి గ్లవ్‌కు తగిలింది. ఆ తర్వాత అతను ఒక బంతిని ఆడాడు. కానీ, నొప్పి ఎక్కువగా ఉందని భావించి, ఫిజియో నుంచి సహాయం తీసుకున్నాడు. ఇక్కడ విచారణ తర్వాత, అతను మైదానం వదిలి స్కానింగ్ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ గాయం తీవ్రత వెలుగులోకి వచ్చింది.

కొన్నోలీ గాయంతో ఆసీస్‌కు ఇబ్బంది..

కొన్నోలీ గాయం కారణంగా ఆస్ట్రేలియా జట్టుతో పాటు బిగ్ బాష్ లీగ్ జట్టు పెర్త్ స్కార్చర్స్ కూడా కష్టాల్లో పడింది. అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇంకా క్లారిటీ లేదు. BBL డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. కొన్నోలీ షెఫీల్డ్ షీల్డ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఆడాల్సి ఉంది. కానీ, ఇప్పుడు తర్వాతి మ్యాచ్ కూడా ఆడలేడు.

కొన్నోలీ బ్రిటన్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం..

సెప్టెంబరులో బ్రిటన్ పర్యటన సందర్భంగా కొన్నోలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులోభాగంగా, అతను స్కాట్లాండ్‌పై తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం, ఇంగ్లాండ్‌లో ODI అరంగేట్రం చేశాడు. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేయలేదు. బౌలింగ్‌లో ఐదు ఓవర్లు వేసినా వికెట్ పడలేదు. అతను ఇటీవల ఇండియా ఎతో జరిగిన తొలి అనధికారిక టెస్టులో ఆడాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి..