జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు భారత క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా అతనికి ఉంది. తొలి టెస్టు మ్యాచ్‌లోనూ సారథ్యం వహించి 8 వికెట్లు తీసి మ్యాచ్‌ను గెలిపించాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విధ్వంసం రెండో టెస్టు మ్యాచ్‌లోనూ కనిపించింది. భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత అతని బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు భారత జట్టు జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఆందోళన చెందుతోంది. ఎందుకంటే అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో బుమ్రా బౌలింగ్ వేస్తూ హఠాత్తుగా కిందపడిపోయాడు. ఫిజియోలు వచ్చి చికిత్స ఇచ్చారు. ఆ తర్వాత బుమ్రా ఆ ఓవర్‌ను పూర్తి చేశాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆట అనంతరం బుమ్రా గాయంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. బుమ్రా గాయపడలేదని, అతనికి జస్ట్ తిమ్మిర్లు వచ్చాయని తెలిపాడు. ప్రస్తుతం బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. దీంతో భారత క్రికెట్ జట్టుతో పాటు అభిమానులందరూ ఊపిరి పీల్చు కున్నారు.
కాగా అడిలైడ్ వేదికగా జరుగుతోన్న పింక్ బాల్ టెస్ట్ లో జస్ప్రీత్ బుమ్రా మినహా ఇతర బౌలర్లు పెద్దగా రాణించలేదు. వికెట్ల కోసం తీవ్రంగా పోరాడారు. మరోవైపు వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఇప్పటికీ ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి లేదు. దీంతో భారత జట్టు బౌలింగ్ విభాగమంతా బుమ్రా పైనే ఉంది.
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..