AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: సెమీఫైనల్లో శ్రీలంకతో టీమిండియా ఫైట్.. వర్షం పడితే గోల్డ్ మెడల్ మనదే

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఐసీసీ మెరుగైన ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా ఫైనల్ చేరుకుంటుంది. ఫైనల్ రోజు కూడా వర్షం పడి ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్ డే లేకపోవడంతో ఇరుజట్లకు ఉమ్మడిగా బంగారం పతకం ప్రకటిస్తారు.

Asian Games 2026: సెమీఫైనల్లో శ్రీలంకతో టీమిండియా ఫైట్.. వర్షం పడితే గోల్డ్ మెడల్ మనదే
Asian Games 2026
Rakesh
|

Updated on: Sep 30, 2026 | 4:54 PM

Share

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా భారత్ సెమీఫైనల్లో శ్రీలంకతో తలపడటానికి సిద్ధమైంది. అయితే టోర్నీ జరుగుతున్న ప్రాంతంలో వాతావరణం ఏమాత్రం అనుకూలించడం లేదు. అంతకుముందు అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. కరోగీ అథ్లెటిక్స్ పార్క్ మైదానంలో టీమిండియా ఇప్పటివరకు ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. ఒకవేళ శ్రీలంకతో జరిగే సెమీఫైనల్ కూడా వర్షం కారణంగా రద్దయితే, ఐసీసీ (ICC) మెరుగైన ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

ఫైనల్ మ్యాచ్‌కూ వర్షం ముప్పు

మరో సెమీఫైనల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడుతున్నాయి. అందులో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌తో తలపడే అవకాశం ఉంది. శనివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రోజు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏషియన్ గేమ్స్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌కి ఎలాంటి రిజర్వ్ డే లేదు. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా ఫైనల్ మ్యాచ్ రద్దయితే, ఫైనల్ చేరిన రెండు జట్లకు ఉమ్మడిగా బంగారు పతకాన్ని బహుకరిస్తారు. 2023లో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో కూడా అఫ్గానిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో మెరుగైన సీడింగ్ ఆధారంగా భారత్‌కు గోల్డ్ మెడల్ లభించింది.

మహిళల జట్టు గోల్డ్ మెడల్

ఇటీవలే ముగిసిన మహిళల క్రికెట్ విభాగంలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసి శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు పురుషుల జట్టు కూడా అదే బాటలో పసిడి పతకం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో, తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. యువ ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు, సీనియర్ బౌలర్లతో కూడిన స్క్వాడ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

ఏషియన్ గేమ్స్ 2026కు భారత పురుషుల క్రికెట్ స్క్వాడ్:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రాజ్ నిగమ్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దేవాలయంలో ఈ 5 ఆచారాలు ఎందుకు పాటిస్తారు? వీటి వెనుక ఉన్న అర్థాలు
దేవాలయంలో ఈ 5 ఆచారాలు ఎందుకు పాటిస్తారు? వీటి వెనుక ఉన్న అర్థాలు
"మన ఇంట్లో ఇలాగే చేసుకుందామా..?"
చికెన్‌లోని ఈ పార్ట్‌ తింటున్నారా?ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమంటే...
చికెన్‌లోని ఈ పార్ట్‌ తింటున్నారా?ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమంటే...
నేలపై పాకకుండా చక్రంలా తిరిగే పాము గురించి తెలుసా?
నేలపై పాకకుండా చక్రంలా తిరిగే పాము గురించి తెలుసా?
ఓం మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆధ్యాత్మిక రహస్యం..
ఓం మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆధ్యాత్మిక రహస్యం..
నేలపై పడిన ఆయిల్ మరకలు పోవడం లేదా? ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లీన్
నేలపై పడిన ఆయిల్ మరకలు పోవడం లేదా? ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లీన్
21 మంది భారతీయ నావికులతో వెళ్తున్న ట్యాంకర్‌పై ప్రొజెక్టైల్ దాడి!
21 మంది భారతీయ నావికులతో వెళ్తున్న ట్యాంకర్‌పై ప్రొజెక్టైల్ దాడి!
మటన్ కర్రీ ఇలా చేశారంటే దుమ్ముదుమారమే..
మటన్ కర్రీ ఇలా చేశారంటే దుమ్ముదుమారమే..
తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.. నిజానికి అతడికే కప్పు ఇవ్వాలి.
తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.. నిజానికి అతడికే కప్పు ఇవ్వాలి.
చూడటానికి మామిడి పండులా ఉంటుంది.. తింటే ప్రాణాలకే ప్రమాదం!
చూడటానికి మామిడి పండులా ఉంటుంది.. తింటే ప్రాణాలకే ప్రమాదం!