AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: ఆసియా కప్ ప్రారంభ వేడుకలో ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శన? ఈవెంట్ ప్రారంభం ఎప్పుడంటే?

Asia Cup 2023 Opening Ceremony Live Streaming: 2023 ఆసియా కప్‌లో పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ మధ్య జరిగే మొదటి మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలు జరుగుతాయి. (అధికారికంగా నిర్వాహకులు ఎటువంటి సమయాన్ని విడుదల చేయలేదు. కానీ నివేదికల ప్రకారం, వేడుక మ్యాచ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది). భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్‌లో టాస్ మధ్యాహ్నం 2.30 గంటలకు, మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

Asia Cup 2023: ఆసియా కప్ ప్రారంభ వేడుకలో ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శన? ఈవెంట్ ప్రారంభం ఎప్పుడంటే?
Asia Cup 2023 Opening Cerem
Venkata Chari
| Edited By: TV9 Telugu|

Updated on: Aug 31, 2023 | 11:48 AM

Share

Asia Cup 2023 Opening Ceremony Live Streaming: ఆసియా కప్ 16వ సీజన్ ODI ఫార్మాట్‌లో జరుగుతోంది. నేడు తొలి మ్యాచ్‌లో భాగంగా నేపాల్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ముల్తాన్ మైదానంలో కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఫేవరెట్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌లోని ముల్తాన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఘనంగా ప్రారంభోత్సవం జరగనుంది. 2018 తర్వాత అంటే ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది వన్డే ఆసియాకప్‌ను నిర్వహించడం ఈ టోర్నీకి మరింత రంగు పులుముకుంది.

ఆసియా కప్ 2023లో భారత క్రికెట్ జట్టుతో సహా మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. ఈ ఆరు జట్లను ఒక్కొక్కటి మూడు గ్రూపులుగా ఉంచారు. గ్రూప్‌-ఎలో భారత్‌, నేపాల్‌, పాకిస్థాన్‌లు, గ్రూప్‌-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లు ఉన్నాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌ ఫోర్‌కి చేరుకుంటాయి. ఆ తర్వాత మొదటి రెండు జట్లు ఫైనల్ ఆడతాయి. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17, 2023 న జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రారంభోత్సవానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

2023 ఆసియా కప్‌లో పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ మధ్య జరిగే మొదటి మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలు జరుగుతాయి. (అధికారికంగా నిర్వాహకులు ఎటువంటి సమయాన్ని విడుదల చేయలేదు. కానీ నివేదికల ప్రకారం, వేడుక మ్యాచ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది). భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్‌లో టాస్ మధ్యాహ్నం 2.30 గంటలకు, మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

ప్రారంభోత్సవం ఎక్కడ నిర్వహించనున్నారు?

ఆసియా కప్ 2023 ప్రారంభ వేడుక ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సమాచారం ప్రకారం, ఏఆర్ రెహమాన్, అతిఫ్ అస్లాం, ఐమా బేగ్, త్రిషాలా గురుంగ్ కూడా ఆసియా కప్ ప్రారంభ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఆసియా కప్ ప్రారంభ వేడుకలను ప్రత్యక్షంగా ఎక్కడ చూడాలి?

ఆసియా కప్ లైవ్ టెలికాస్ట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. కాబట్టి మీరు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రారంభ వేడుకలను వివిధ భాషలలో చూడొచ్చు. మీరు OTT ప్లాట్‌ఫారమ్ హాట్‌స్టార్‌లో ఆసియా కప్ ప్రారంభ వేడుకలు, మ్యాచ్‌లను కూడా ఉచితంగా చూడొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..