Nepal Cricket Team: తొలిసారి ఆసియా కప్ ఆడనున్న నేపాల్ టీం.. వారి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Nepal Cricketers Salaries: భారత క్రికెటర్ల జీతం లక్షలు, కోట్లలో ఉంటుంది. కానీ, నేపాల్ క్రికెటర్ల విషయంలో అలా కాదు. వారి జీతం భారతదేశంలోని ప్యూన్లకు ఇచ్చే జీతం కంటే చాలా తక్కువగా ఉంది. నేపాల్ జట్టు తొలిసారిగా ఆసియా కప్ ఆడుతోంది. ఇది వారికి పెద్ద అచీవ్‌మెంట్ కానుంది.

నేపాల్ క్రికెట్ జట్టు తొలిసారి ఆసియా కప్‌లో ఆడుతోంది. అయితే నేపాల్ ఆటగాళ్ల జీతం ఎంతో తెలుసా? వాళ్ల సంపాదన ఎంత? క్రికెట్‌లో డబ్బు బాగా సంపాదిస్తారని అందరికీ తెలిసిందే. కానీ, ప్రతి క్రికెట్ టీమ్‌లోని ఆటగాళ్లపై డబ్బుల వర్షం ఒకేలా ఉండదు. భారత క్రికెటర్లు సంపాదిస్తున్నంత సంపాదన గురించి నేపాల్ క్రికెట్ ఆటగాళ్లు అస్సలు ఆలోచించలేరు. నిజం చెప్పాలంటే, నేపాల్ క్రికెటర్ల జీతం చాలా తక్కువ.
భారతదేశం లేదా ఇతర దేశాల మాదిరిగానే, నేపాల్ క్రికెట్ బోర్డు కూడా తన ఆటగాళ్లతో వార్షిక ఒప్పందాలు చేసుకుంటుంది. వారిని 3 కేటగిరీలుగా విభజించి దానికి అనుగుణంగా జీతం ఇస్తుంది. కానీ, దాని విలువ భారత రూపాయల్లో ఎంత?




నేపాల్ క్రికెటర్లకు ఎంత జీతం వస్తుంది?
సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం నేపాల్ పురుషుల క్రికెటర్లు 3 విభాగాలుగా విభజించబడ్డారు. ఏ గ్రేడ్‌లో చేరిన క్రికెటర్లు ప్రతి నెలా 60 వేల రూపాయల జీతం పొందుతారు. బి గ్రేడ్‌లో ఉన్న వారికి రూ.50 వేలు, గ్రేడ్ సిలో ఉన్న వారికి రూ.40 వేలు అందజేస్తారు.
నేపాల్‌లో 60,000 వేతనం పొందుతున్న క్రికెటర్ల విలువ భారతదేశంలో రూ.37,719లు మాత్రమే. అదేవిధంగా 50,000 నేపాలీ రూపాయల విలువ కేవలం రూ.31,412లు మాత్రమే. మరోవైపు 40000 నేపాలీ రూపాయలు పొందే నేపాలీ క్రికెటర్లకు భారత కరెన్సీలో కేవలం రూ. 25 వేలు మాత్రమే అందుకుంటుంటారు. ఇప్పుడు భారతదేశంలోని ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఒక ప్యూన్ జీతం నేపాల్ క్రికెటర్లకు నెలకు వచ్చే జీతం కంటే ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ కనీసం వారి ప్యాకేజీ కూడా సంవత్సరానికి 5.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది.
ఒక వన్డేకి రూ.6000లు..
View this post on Instagram
సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం నెలవారీ జీతం కాకుండా, నేపాల్ క్రికెటర్లకు ఇతర ఆదాయ వనరు వారు ప్రతి మ్యాచ్‌కి పొందే రుసుము. ఒక వన్డే ఆడినందుకు 10000 నేపాలీ రూపాయలు, T20 మ్యాచ్ ఆడినందుకు 5000 నేపాలీ రూపాయిలను అందుకుంటాడు. అంటే భారత కరెన్సీ ప్రకారం, వారు ఒక ODIకి రూ. 6286, 1 T20కి రూ. 3143 పొందుతారు. డబ్బు తక్కువే కానీ నేపాలీ క్రికెటర్ల ఉద్దేశం బలంగా ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




