Asia Cup 2023: ఆసియా కప్ 2023లో నేడు, రేపు మ్యాచ్‌లు లేవు.. ఎందుకో తెలుసా?

|

Sep 07, 2023 | 11:36 AM

Asia Cup 2023: ఆసియా కప్‌లో సూపర్-4 దశలో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్, ఇండియా, బంగ్లాదేశ్. తొలి మ్యాచ్‌ బుధవారం పాకిస్థాన్‌లో జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. కానీ, ఈరోజు, రేపు ఆసియా కప్‌లో మ్యాచ్‌లు లేవు. ఆసియా కప్‌లో రెండు రోజుల పాటు ఏ మ్యాచ్‌ జరగదు. అయితే రెండు రోజుల పాటు మ్యాచ్ నిర్వహించకపోవడానికి ఓ కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Asia Cup 2023: ఆసియా కప్ 2023లో నేడు, రేపు మ్యాచ్‌లు లేవు.. ఎందుకో తెలుసా?
Asia Cup Super 4 Matches
Follow us on

Asia Cup 2023 Super 4: ఆసియా కప్ 2023 (Asia Cup 2023) టోర్నమెంట్‌లో సూపర్-4 దశ మ్యాచ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 6న జరిగిన సూపర్-4 దశ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ సునాయాస విజయం సాధించి ఫామ్‌ను కొనసాగించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బాబర్స్ జట్టు కళ్లు చెదిరే బౌలింగ్‌తో బంగ్లాను ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈరోజు, రేపు మ్యాచ్‌లు ఆసియాకప్‌లో నిర్వహించడంలేదు. ఆసియా కప్‌లో రెండు రోజుల పాటు ఏ మ్యాచ్‌‌లు జరగవు. దీనికి ఓ కారణం ఉంది.

ఆసియా కప్‌లో సూపర్-4 దశలో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్, ఇండియా, బంగ్లాదేశ్. తొలి మ్యాచ్‌ బుధవారం పాకిస్థాన్‌లో జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శ్రీలంకలో జరుగుతుంది. బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్ నుంచి లంకకు వెళ్లేందుకు సమయం కావాలి. అందుకే ఒకరోజు ప్రయాణానికి, మరో రోజు విశ్రాంతికి కాబట్టి రెండు రోజుల పాటు ఆసియాకప్‌లో మ్యాచ్‌ నిర్వహించడంలేదు.

ఇవి కూడా చదవండి

9న లంకతో బంగ్లా మ్యాచ్..

సెప్టెంబరు 9న ఆసియా కప్‌లో సూపర్-4 దశ మ్యాచ్‌లో శ్రీలంక-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శన కనబర్చిన శ్రీలంక సూపర్-4లో ఎలా రాణిస్తుందో చూడాలి.

మ్యాచ్‌ల వేదికల్లో మార్పు లేదు..

ఆసియా కప్‌లో సూపర్‌-4 రౌండ్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల వేదికలను మార్చే అవకాశం ఉందని పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. కానీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చింది. ఆసియా కప్ మ్యాచ్‌ల వేదికలలో ఎటువంటి మార్పు లేదంటూ తేల్చిచెప్పేసింది. ముందుగా నిర్ణయించిన ఈ వేదికల్లో అంటే కొలంబోలోనే మ్యాచ్‌లు జరుగుతాయి. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని సమాచారం.

హరీష్ రవూఫ్ అద్భుత బౌలింగ్ వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..