టీమిండియాకు శనిలా దాపురించింది.. ఆ ముగ్గురి మధ్య ఊగిసలాట.. తేడా వస్తే కప్పు గల్లంతే.!
అసలే వన్డే ప్రపంచకప్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుండటం.. దాని ముందు సన్నాహకంగా ఆసియా కప్ జరుగుతుండటంతో.. టీమ్ మేనేజ్‌మెంట్ ప్లేయర్స్‌పై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంతవరకూ బాగానే ఉంది గానీ.. ఒక విషయం మాత్రం రోహిత్ శర్మ, ద్రావిడ్‌లను సతమతమయ్యేలా చేస్తోంది.
ఆసియా కప్ 2023 సమరానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఎంపికైన 17 మంది సభ్యులతో కూడిన టీమిండియా ప్రాబబుల్స్ బెంగళూరు వేదికగా ముమ్మరంగా శిక్షణ కొనసాగిస్తున్నారు. అసలే వన్డే ప్రపంచకప్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుండటం.. దాని ముందు సన్నాహకంగా ఆసియా కప్ జరుగుతుండటంతో.. టీమ్ మేనేజ్‌మెంట్ ప్లేయర్స్‌పై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంతవరకూ బాగానే ఉంది గానీ.. ఒక విషయం మాత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లను సతమతమయ్యేలా చేస్తోంది.
పేపర్ మీద జట్టు బలంగా ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో ఎవర్ని ఆడించాలన్నది ఇప్పుడు ఆ ఇద్దరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఛాన్స్‌లు ఇస్తుండటంతో.. ఈ సమస్య మరింత జటిలంగా మారింది. ఒకప్పుడు ఈ స్థానంలో సుదీర్ఘ కాలం పాటు రాణించిన యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ ప్లేస్‌ను మరే క్రికెటర్ సుస్థిరం చేసుకోలేకపోయారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రయోగాలు చేయడం మంచిది కాదు కాబట్టి.. ఎప్పటిలానే శుభ్‌మాన్ గిల్, రోహిత్ శర్మలు ఓపెనింగ్ దిగితే.. విరాట్ కోహ్లి వన్‌డౌన్ ఆడతాడు. ఇక నాలుగో స్థానం కోసం శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ మధ్య పోటీ నెలకొంది. ఒకవేళ టాప్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ కొరత ఉంటే.. తిలక్ వర్మ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
టీమిండియా స్పాన్సర్‌షిప్ హక్కులు..
🚨 NEWS 🚨
IDFC First acquires title sponsorship rights for all BCCI international and domestic home matches.
Details 🔽
— BCCI (@BCCI) August 25, 2023
శ్రేయాస్ అయ్యర్.. నాలుగో స్థానాన్ని భర్తీ చేయగలిగిన సమర్ధుడు. మిడిలార్డర్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పగలడు. గతంలోనూ పలు ఇన్నింగ్స్‌లలో చేసి చూపించాడు. వెన్నుముక గాయంతో ఇన్నాళ్లు జట్టుకు దూరమైన అతడు.. ప్రస్తుతం ఎన్‌సిఏలో పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిస్తే.. వరల్డ్‌కప్‌లో బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.
కెఎల్ రాహుల్.. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ నెంబర్ 4లో రాణించగల ప్లేయర్. అయినప్పటికీ రాహుల్‌కి ఐదో స్థానం బెటర్ ఆప్షన్. ఫినిషింగ్ చేయడంతో పాటు ఆఖరి 10 ఓవర్లలోనూ చక్కటి రన్‌రేట్ ఇవ్వగలడు. జట్టు అవసరాలకు అనుగుణంగా స్కోర్ కూడా చేయగలడు.
విరాట్ కోహ్లి.. అదేంటి కోహ్లి నెంబర్ 3 కదా అనుకునేరు. కానీ ఈ మధ్య కోహ్లి స్థానం కూడా మారుతూ వస్తోంది. టెస్టుల్లో నెంబర్ 4లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇషాన్‌ను ఓపెనింగ్ పంపి.. గిల్‌ను మూడో స్థానంలో పంపితే.. కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి రావాల్సి ఉంటుంది. అయితే కోహ్లి నాలుగో స్థానంలో కంటే వన్‌డౌన్‌లోనే మెరుపు ఇన్నింగ్స్‌లు చేస్తాడు. ప్రత్యర్ధులకు గట్టి పోటీని సైతం ఇవ్వగలడు.
Here’s the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
ఆసియా కప్‌కి భారత జట్టు ఇదే :
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ