AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2023: రోహిత్ రికార్డుకు బ్రేకులు.. లార్డ్స్‌ సెంచరీతో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్..!

Steve Smith Century: లార్డ్స్ మైదానంలో జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్‌లో 32వ సెంచరీతో మెరిశాడు.

Ashes 2023: రోహిత్ రికార్డుకు బ్రేకులు.. లార్డ్స్‌ సెంచరీతో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్..!
Ashes 2023 Steve Smith
Venkata Chari
|

Updated on: Jun 30, 2023 | 11:11 AM

Share

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్‌లో 32వ సెంచరీని నమోదు చేశాడు. టెస్టు తొలిరోజు అజేయంగా 85 పరుగులు చేసిన స్మిత్ రెండో రోజు తన స్కోరుకు 15 పరుగులు జోడించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టీవ్ స్మిత్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 22 పరుగులు (16, 6 పరుగులు) మాత్రమే చేశాడు. కానీ, స్మిత్ లార్డ్స్‌లో తన లయను కనుగొన్నాడు. 110 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సెంచరీతో ఎన్నో రికార్డులు లిఖించాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 32 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా స్టీవ్ స్మిత్ నిలిచాడు. కేవలం 174 ఇన్నింగ్స్‌ల్లోనే స్మిత్‌ ఈ రికార్డును నెలకొల్పాడు. స్మిత్ కంటే ముందు ఈ రికార్డు 176 ఇన్నింగ్స్‌ల్లో 34 సెంచరీలు చేసిన రికీ పాంటింగ్ పేరిట ఉంది. ఈ సెంచరీతో స్టీవ్ స్మిత్ యాషెస్‌లో 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో యాషెస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా జాక్ హాబ్స్ రికార్డును స్మిత్ సమం చేశాడు. యాషెస్‌లో 19 సెంచరీలు చేసిన బ్రాడ్‌మన్ పేరిట ఈ రికార్డు ఉంది.

లార్డ్స్‌ సెంచరీతో స్మిత్ ఇంగ్లండ్‌లో తన 8వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో విజయవంతమైన విదేశీ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌లో 11 సెంచరీలు చేసిన బ్రాడ్‌మన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక టెస్టు సెంచరీలు (32) సాధించిన ఆటగాడిగా కూడా స్టీవ్ స్మిత్ రికార్డు సృష్టించాడు. అలాగే, టెస్టు సెంచరీల పరంగా స్టీవ్ వాను సమం చేశాడు. స్మిత్‌తో పాటు రికీ పాంటింగ్ 41 సెంచరీలతో ఆసీస్ తరపున అత్యధిక సెంచరీలు సాధించాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీల జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా స్మిత్ అధిగమించి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. స్మిత్ తన 44వ అంతర్జాతీయ సెంచరీని లార్డ్స్‌లో (టెస్టులలో 32, వన్డేలలో 12) నమోదు చేయగా, రోహిత్ ఇప్పటివరకు 43 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు.

తొలి టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ ఆధారంగా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..