AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar: నిశ్చితార్థం అయిన వెంటనే అర్జున్ టెండూల్కర్‌కి బిగ్ షాక్.. అదేంటంటే?

Arjun Tendulkar: ఇటీవల సానియాతో నిశ్చితార్థం చేసుకున్నందుకు అర్జున్ టెండూల్కర్ సంతోషంగా ఉన్నాడు. కానీ, కెరీర్‌లో ఎదురుదెబ్బ తగిలిన అర్జున్‌కు దులీప్ ట్రోఫీలో ఆడే అవకాశం రాలేదు. రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, అతన్ని నార్త్ ఈస్టర్న్ జోన్ జట్టు ఎంపిక చేయలేదు.

Arjun Tendulkar: నిశ్చితార్థం అయిన వెంటనే అర్జున్ టెండూల్కర్‌కి బిగ్ షాక్.. అదేంటంటే?
Asia Cup 2025 Arjun Tendulkar
Venkata Chari
|

Updated on: Aug 18, 2025 | 8:20 AM

Share

Arjun Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకోవడం ద్వారా తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే, అర్జున్ కెరీర్ పరంగా పెద్ద షాక్ ఎదుర్కొన్నాడు. ఆగస్టు 28 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో అర్జున్‌కు అవకాశం రాలేదు. చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. కానీ, సచిన్ కొడుకును ఈసారి విస్మరించారు. గోవా తరపున దేశవాళీ క్రికెట్ ఆడే అర్జున్ టెండూల్కర్ దులీప్ ట్రోఫీలో ఆడాలని ఆశించాడు. కానీ, నార్త్ ఈస్ట్ జోన్ జట్టు అతని ఆశలను వమ్ము చేసింది.

దులీప్ ట్రోఫీ నుంచి అర్జన్ ఔట్..

రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్, దులీప్ ట్రోఫీ కోసం నార్త్ ఈస్ట్ జోన్ జట్టులో చోటు దక్కించుకోలేదు. రోంగ్సేన్ జోనాథన్ నేతృత్వంలోని జట్టు ఆగస్టు 28న సెంట్రల్ జోన్‌తో తలపడనుంది. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో అర్జున్ టెండూల్కర్ నాలుగు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. దీని కారణంగా, గోవా ప్లేట్ డివిజన్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

2022-23 సీజన్ నుంచి అర్జున్ గోవా తరపున ఆడుతున్నాడు. డిసెంబర్ 2023లో గోవా తరపున తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడిన అర్జున్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 37 వికెట్లు తీసిన అర్జున్ 532 పరుగులు చేశాడు. నవంబర్ 2022లో గోవా తరపున లిస్ట్-ఏలో అరంగేట్రం చేసిన అర్జున్ 18 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీసి 102 పరుగులు చేశాడు. గోవాకు వెళ్లే ముందు, ముంబై తరఫున టీ20లో అరంగేట్రం చేశాడు. అర్జున్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున కూడా ఆడాడు.

గిల్, గైక్వాడ్ ఆడనున్నారు..

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వెటరన్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. ఈ టోర్నమెంట్‌లో శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలో రుతురాజ్ గైక్వాడ్ వెస్ట్ జోన్ జట్టు తరపున ఆడనున్నారు. ఇదిలా ఉండగా, దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తారు.

ఆగస్టు 28 నుంచి 31 వరకు జరిగే ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్, ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్‌తో తలపడుతుంది. నార్త్ ఈస్ట్ జోన్, ధ్రువ్ జురెల్ నేతృత్వంలోని సెంట్రల్ జోన్‌తో తలపడుతుంది. దులీప్ ట్రోఫీ ఫైనల్ సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..