11 ఫోర్లు, 7 సిక్సర్లు.. 46 బంతుల్లో అనామకుడి ఆగమనం.. ఐపీఎల్ స్టార్స్‌కు బడితపూజ

West Delhi Lions vs South Delhi Superstarz, 7th Match: ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, సౌత్ ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సౌత్ ఢిల్లీ తరపున కున్వర్ బిధురి, కెప్టెన్ ఆయుష్ బదోని ఆకట్టుకున్నారు. అయితే, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు 200 పరుగుల కంటే తక్కువ స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది.

11 ఫోర్లు, 7 సిక్సర్లు.. 46 బంతుల్లో అనామకుడి ఆగమనం.. ఐపీఎల్ స్టార్స్‌కు బడితపూజ
Ankit Kumar Dpl 2025

Updated on: Aug 07, 2025 | 6:31 AM

Delhi Premier League: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమైంది. దీంతో కొంతమంది ఐపీఎల్ స్టార్లు ఈ లీగ్‌లో తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం లీగ్‌లో 7వ మ్యాచ్‌ గత రాత్రి జరిగింది. ఇందులో వెస్ట్ ఢిల్లీ బ్యాటర్ అంకిత్ కుమార్ సౌత్ ఢిల్లీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తుఫాను బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరపున ఆడే అంకిత్ కుమార్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో మ్యాచ్‌ ఉత్కంఠను తారా స్థాయికి చేర్చాడు. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, అంకిత్ 46 బంతుల్లో 96 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాదేశాడు. అంకిత్ విధ్వంసక బ్యాటింగ్ ఫలితంగా వెస్ట్ ఢిల్లీ జట్టు 15.4 ఓవర్లలో 186 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది.

అంకిత్ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించడమే కాదు.. ఐపీఎల్ ఫేమ్ దిగ్వేష్ రతితో మైదానంలో అతని వాగ్వాదం మ్యాచ్ వాతావరణాన్ని మరింత హీటెక్కించింది. ఈ సమయంలో, ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అయితే, త్వరగానే గొడవ సద్దుమణిగింది. ఈ మ్యాచ్‌లో దిగ్వేష్ రతి చాలా ఖరీదైనవాడిగా నిరూపితమయ్యాడు. అతను కేవలం 2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

క్రిష్ యాదవ్ హాఫ్ సెంచరీ..

అంకిత్ కుమార్‌తో పాటు, క్రిష్ యాదవ్ కూడా వెస్ట్ ఢిల్లీ తరపున అద్భుతంగా రాణించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ క్రిష్ 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను 9 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఈ విధంగా, అంకిత్‌తో కలిసి, క్రిష్ మొదటి వికెట్‌కు 158 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, సౌత్ ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సౌత్ ఢిల్లీ తరపున కున్వర్ బిధురి, కెప్టెన్ ఆయుష్ బదోని ఆకట్టుకున్నారు. మిగతా ప్లేయర్లు  ఆకట్టుకోలేకపోయారు. ఈ కారణంగానే ఆ జట్టు 200 పరుగుల కంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీని కారణంగా స్టార్లతో నిండిన సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..