IND vs AUS: టీమిండియాలోకి మరో తెలుగమ్మాయి.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన అంజలి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. త్వరలో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో అంజలికి స్థానం దక్కింది.

IND vs AUS: టీమిండియాలోకి మరో తెలుగమ్మాయి.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన అంజలి
Anjali Sarvani
Follow us

|

Updated on: Dec 02, 2022 | 3:58 PM

భారత మహిళల క్రికెట్‌ జట్టులో తెలుగమ్మాయిల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన మిథాలీరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సబ్బినేని మేఘన కూడా టీమిండియా జట్టులోకి అడుగుపెట్టి అదరగొడుతోంది. ఇప్పుడీ జాబితాలోకి మరొకరు చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. త్వరలో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో అంజలికి స్థానం దక్కింది. కాగా టీమిండియాకు అంజలి శర్వాణి ఎంపిక కావడంపై ఆమె తల్లిదండ్రులు తెగ సంబరపడిపోతున్నారు. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా.. తల్లి సాధారణ గృహిణి. చదువుకుంటూనే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. ఆతర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు.. ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో క్రికెట్‌ వైపు అడుగులు వేసిన అంజలి.. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది. ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచిన భారత మహిళా క్రికెట్ టీమ్ దాదాపు నెలన్నర బ్రేక్ తర్వాత తిరిగి మైదానంలో దిగనుంది.

కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 9న ఇండియా – ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 11న రెండో టీ20, 14న మూడో టీ20, 17న నాలుగో టీ20 మ్యాచులు జరుగుతాయి. డిసెంబర్ 20న ఆఖరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ టూర్‌కి కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరించనున్నారు. అలాగే వీరితో పాటు యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ, వికెట్ కీపర్ యషికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణీ, దేవికా వైద్య, ఎస్ మేఘన, రిచా ఘోష్, హర్లీన్ డియోల్‌లకు చోటు దక్కింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..