Srikar Bharat: ‘బాల్‌ బాయ్‌ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్‌ దాకా’.. సొంత గడ్డపై శ్రీకర్‌ భరత్‌కు ఘన సన్మానం

|

Feb 01, 2024 | 5:59 PM

సొంత గడ్డపై తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న భరత్‌కు వైజాగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా క్రికెట్‌ అసోషియేషన్‌ సభ్యుల్‌ భరత్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఇదే స్టేడియంలో బాల్‌ బాయ్ గా ఉన్న శ్రీకర్‌ భరత్‌ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెటర్‌ అయ్యాడు

Srikar Bharat: బాల్‌ బాయ్‌ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్‌ దాకా.. సొంత గడ్డపై శ్రీకర్‌ భరత్‌కు ఘన సన్మానం
Srikar Bharat
Follow us on

 

టీమిండియా క్రికెటర్‌, తెలుగు తేజం శ్రీకర్‌ భరత్‌ను ఆంధ్రా క్రికెటర్‌ అసోసియేషన్‌ (ACA) గురువారం (ఫిబ్రవరి 01) ఘనంగా సన్మానించింది. సొంత గడ్డపై తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న భరత్‌కు వైజాగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా క్రికెట్‌ అసోషియేషన్‌ సభ్యుల్‌ భరత్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఇదే స్టేడియంలో బాల్‌ బాయ్ గా ఉన్న శ్రీకర్‌ భరత్‌ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెటర్‌ అయ్యాడు. ఇది అతని విజయానికి దక్కిన గౌరవమని క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రశంసించింది. శ్రీకర్‌ భరత్‌ క్రికెట్‌ ప్రయాణం వైజాగ్‌లోలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే ప్రారంభమైంది. 2005లో బాల్ బాయ్‌గా ఎక్కడైతే పనిచేశాడో.. అదే స్టేడియంలో ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. తద్వారా సొంతగడ్డపై టెస్టులో ఆడనున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా భరత్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో
భరత్‌ కంటే ముందు ఆంధ్ర దిగ్గజ ప్లేయర్‌ సీకే నాయుడు ఉన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్‌, హనుమ విహారి భారత్‌ తరపున టెస్టుల్లో ఆడినప్పటికీ.. సొంతగడ్డపై ఆడే ఛాన్స్‌ మాత్రం రాలేదు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది రోహిత్‌ సేన.

 

రెండో టెస్టుకు టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యస్సావి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.

టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, రెహాన్ అహ్మద్, డేన్ లారెన్స్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), షోయబ్ బషీర్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జేమ్స్ ఆండర్సన్, గుస్ అట్కిన్సన్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్ , ఒల్లీ పోప్, జో రూట్, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..