Siraj: సిరాజ్‌కు ఒక ఎస్‌యూవీ గిఫ్ట్‌గా ఇవ్వండి.. నెటిజన్ కామెంట్‌కి ఆనంద్ మహీంద్ర సూపర్ రిప్లై
ఆసియా కప్ హీరో నిలిచాడీ కుర్రాడు. క్రికెట్ అభిమానులతో పాటు సెలబ్రిటీల మన్ననలు పొందుతున్నాడు సిరాజ్. సిరాజ్‌పై ప్రశంసలు జల్లు కురుస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సిరాజ్‌పై పొగడ్తల వర్షం కురిపించగా తాజాగా ప్రముఖ పారిశ్రామిమికవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ప్రశంసల జల్లు కురిపించారు...
ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను మట్టి కరిపించిన హైదరాబాద్ బౌలర్.. మహ్మద్ సిరాజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు దేశంలో ఎవరి నోట విన్నాసిరాజ్ పేరే వినిపిస్తోంది. ఆసియా కప్ హీరో నిలిచాడీ కుర్రాడు. క్రికెట్ అభిమానులతో పాటు సెలబ్రిటీల మన్ననలు పొందుతున్నాడు సిరాజ్. సిరాజ్‌పై ప్రశంసలు జల్లు కురుస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సిరాజ్‌పై పొగడ్తల వర్షం కురిపించగా తాజాగా ప్రముఖ పారిశ్రామిమికవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ప్రశంసల జల్లు కురిపించారు. సిరాజ్‌కు ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వండని అడిగిన ఓ నెటిజన్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్ర ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ రిప్లై ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే… ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన హైదరాబాద్ బౌలర్.. మహ్మద్ సిరాజ్ .. దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఫర్మార్మెన్స్ తో అద్భుత బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో నాలుగు వికేట్లు తీసి రాకార్డు సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఆరు వికెట్లు శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఆసియా కప్‌ను భారత్‌కు సునాయాశంగా అందించాడు. అయితే సిరాజ్ ఫర్మార్మెన్స్ పై ప్రశంసలు కొనసాగుతున్నాయి. సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా సిరాజ్‌ను కొనియాడారు.
మన ప్రత్యర్థుల కోసం తాను ఇంతకు ముందెన్నడూ బాధపడలేదు. అయితే ఇప్పుడు మనం వారిపై ఏదో ఒక అతీంద్రియ శక్తిని విడుదల చేసినట్లుగా ఉంది. సిరాజ్ నువ్వొక మార్వెల్ అవెంజర్” అంటూ ఆకాశానికి ఎత్తాడు ఆనంద్ మహింద్ర. ఆయన ట్వీట్ కు ఓ అభిమాని విచిత్రమైన రిట్వీట్ చేశాడు. సార్, ప్లీజ్ సిరాజ్‌కు ఓ ఎస్‌యూవీని గిప్ట్ గా ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దానిపై ఆనంద్ మహీంద్రా బదులిస్తూ సిరాజ్‌కు గతంలోనే ఓ కారు ఇచ్చినట్లు తెలిపారు.
ఆనంద్ మహీంద్ర ట్వీట్..
I don’t think I have EVER before felt my heart weep for our opponents….It’s as if we have unleashed a supernatural force upon them… @mdsirajofficial you are a Marvel Avenger… https://t.co/DqlWbnXbxq
— anand mahindra (@anandmahindra) September 17, 2023
సిరాజ్‌కు 2021లోనే ‘థార్’ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ గెలిచిన సందర్భంగా థార్‌ను గిప్ట్ గా ఇచ్చినట్లు గుర్తుచేశారు. అలాగే ఫైనల్ మ్యాచ్‌లో 4లక్షల రూపాయలు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న సిరాజ్ .. ఆమనీని కొలంబో గ్రౌండ్ సిబ్బందికి బహుమతిగా ఇచ్చాడు. దీనిపై కూడా ఆనంద్ మహీంద్రా సిరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. సిరాజ్ నిర్ణయం దిక్లాస్ అని చెప్పారు. ‘‘ఇది మీ సంపద లేదా మీ నేపథ్యం నుంచి వచ్చేది కాదు. మీలో ఉన్న దయాగుణం నుంచి బయటికి వస్తుందని ట్వీట్టర్ లో పొగిడారు ఆనంద్ మహింద్ర.
Been there, done that… https://t.co/jBUsxlooZf
— anand mahindra (@anandmahindra) September 17, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..