మాకు వర్షం కావాలి..వరల్డ్ కప్‌ను భారత్‌కు మార్చండి
ముంబై: ప్రపంచ కప్ అంటే ఒక ఎగ్జైట్‌మెంట్. ఈ ఈవెంట్ కోసం క్రికెట్ లవర్స్ అందరూ కళ్లు కాయలు కాసేలా నాలుగేళ్ల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రజంట్ వరల్డ్ కప్ మాత్రం ఫ్యాన్స్‌కు అంత కిక్ ఇవ్వడం లేదు. ఇప్పటివరకు జరిగిన 19 మ్యాచుల్లో నాలుగు వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అందులో టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కూడా ఒకటి. గురువారం జరగాల్సిన ఈ మ్యాచ్..వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. అసలే క్రికెట్ […]
ముంబై: ప్రపంచ కప్ అంటే ఒక ఎగ్జైట్‌మెంట్. ఈ ఈవెంట్ కోసం క్రికెట్ లవర్స్ అందరూ కళ్లు కాయలు కాసేలా నాలుగేళ్ల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రజంట్ వరల్డ్ కప్ మాత్రం ఫ్యాన్స్‌కు అంత కిక్ ఇవ్వడం లేదు. ఇప్పటివరకు జరిగిన 19 మ్యాచుల్లో నాలుగు వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అందులో టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కూడా ఒకటి. గురువారం జరగాల్సిన ఈ మ్యాచ్..వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. అసలే క్రికెట్ అంటే పిచ్చెక్కిపోయే మన ఇండియన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా! ఎడాపెడా ఐసీసీని ట్రోల్ చేశారు. #ShameOnICC ను ట్విటర్‌లో జోడించారు. ఆ రోజు మొత్తం ఇది ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాదు ధోని గ్లోవ్స్‌పై ఐసీసీ పెట్టిన శ్రద్ధ మ్యాచ్‌ల నిర్వహణపై, అంపైర్లను ఎంచుకోవడంపై పెడితే బాగుంటుందని నెటిజన్లు చురకలు అంటించారు.
ఇందులో భాగంగా ఓ క్రికెట్ అభిమాని సోషల్ మీడియాలో చూపించిన ఆవేదనను గుర్తించిన బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఐసీసీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘ఐసీసీ ప్రపంచ కప్‌ను దయచేసి భారత్‌కు మార్చండి. ఎందుకంటే మాకిక్కడ వర్షాలు కావాలి’ అంటూ నవ్వూతూ ఉన్న ఎమోజీలను జోడించి ట్వీట్ చేశారు. దీంతో బిగ్‌బీ ట్వీట్ కూడా వైరల్ అయింది. ఐసీసీకి బిగ్‌బీ సరైన పంచ్ వేశారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
కాగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పైనా వర్షం ప్రభావం చూపించే అవకాశముందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రేజీ మ్యాచ్ అయినా అభిమానులకు కిక్ ఇవ్వాలని ఆశిద్దాం.
shift the tournament WC 2019 to India .. we need the rain .. !!! ??? https://t.co/KcGAAEODyr
— Amitabh Bachchan (@SrBachchan) June 13, 2019