Gautam Gambhir: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గౌతమ్ గంభీర్‌లాంటి కోచ్ కావాలట..!
పాకిస్థాన్‌ను దాని సొంత గడ్డపై బంగ్లాదేశ్ చిత్తుగా ఓడించింది. రెండు టెస్ట్‌ల సిరిస్‌ను 2-0 తేడాతో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. పాకిస్థాన్ గడ్డపై ముందెప్పుడూ టెస్ట్ మ్యాచ్ గెలవని బంగ్లాదేశ్.. ఏకంగా టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవం ఆతిథ్య జట్టుకు పీడకలగానే మిగిలిపోయింది. ఓ రకంగా పాకిస్థాన్ క్రికెట్ మునుపెన్నడూ లేనంత గడ్డు కలాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్లుగానే పాకిస్థాన్ క్రికెటర్లు పేలవమైన ఆటతీరును కనబరుస్తున్నారు.
పాకిస్థాన్‌ను దాని సొంత గడ్డపై బంగ్లాదేశ్ చిత్తుగా ఓడించింది. రెండు టెస్ట్‌ల సిరిస్‌ను 2-0 తేడాతో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. పాకిస్థాన్ గడ్డపై ముందెప్పుడూ టెస్ట్ మ్యాచ్ గెలవని బంగ్లాదేశ్.. ఏకంగా టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఆతిథ్య జట్టుకు పీడకలగానే మిగిలిపోయింది. ఓ రకంగా పాకిస్థాన్ క్రికెట్ మునుపెన్నడూ లేనంత గడ్డు కలాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్లుగానే పాకిస్థాన్ క్రికెటర్లు పేలవమైన ఆటతీరును కనబరుస్తున్నారు. వారి ఆటతీరు దారుణంగా ఉందంటూ పాకిస్థాన్ మీడియాతో పాటు మాజీ క్రికెటర్లు ఏకిపారేస్తున్నారు. గ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న విభేదాలు, జట్టులో గ్రూపిజమే పాక్ జట్టు వరుస ఓటములకు కారణమంటూ కొందరు మాజీ క్రికెటర్లు ఓపన్‌గానే పెదవి విరుస్తున్నారు. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా దీనికి కారణమంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీబీ, జట్టులో పదేపదే మార్పులు చేయడం ప్రస్తుత దుస్థితి కారణమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు పూర్వ వైభవం సాధించాలంటే ఫలానా మార్పులు చేయాలంటూ మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిపుణులు సూచనలు కూడా చేస్తున్నారు.
పీసీబీకి డానిష్ కనేరియా కీలక సూచనలు..
పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా తమ జట్టు కోసం పాక్ క్రికెట్ బోర్డుకు కొన్ని కీలక సూచనలు చేశాడు. పాక్ జట్టు ఆటగాళ్లలో బాధ్యతారాహిత్యం తారస్థాయికి చేరిందంటూ మండిపడ్డాడు. అందుకే ప్రస్తుతం పాక్ క్రికెట్ జట్టు ఈ దుస్థితిలో ఉందన్నాడు. పదేపదే జట్టు కెప్టెన్‌ను మార్చడం ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డాడు. పరిస్థితిలో మార్పు రావాలంటే కఠినంగా వ్యవహరించే గౌతమ్ గంభీర్‌లాంటి వ్యక్తి పాక్ జట్టుకు కోచ్‌గా రావాలని అకాంక్షించాడు. కెప్టెన్‌కు కనీసం ఒక సంవత్సరం టైమ్ ఇవ్వాలని.. అతనికి ఆటగాళ్లు అందరూ సపోర్ట్ చేసేలా చూడాలని అన్నాడు. ఆటగాళ్లు సరిగ్గా రాణించకుంటే జట్టు నుంచి బయటకు పంపాలని.. కఠినంగా లేకుంటే జట్టు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నాడు.
టీమిండియాతో పాటు ఇతర జట్లు బాగా రాణిస్తుంటే.. పాక్ జట్టు ఎందుకు రాణించలేకపోతోందో పాక్ క్రికెట్ బోర్డు సమీక్షించుకోవాలని డానిష్ కనేరియా సూచించాడు. మొన్నటి వరకు రాహుల్ ద్రవిడ్.. ఇప్పుడు గౌతమ్ గంభీర్ టీమిండియాకు మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడాడు. గౌతమ్ గంభీర్ అద్భుతమైన ఆటగాడు..మంచి వ్యక్తి.. ఎదుటి వారికి ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే చెప్పేస్తాడు అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ముందు ఒకటి మాట్లాడి.. వెనుకకు వెళ్లి మరొకటి మాట్లాడే తత్వం గౌతమ్ గంభీర్ కాదన్నాడు. జట్టులో కీలకమైన బాధ్యతలు నిర్వహించే వారికి ఉండాల్సిన లక్షణం ఇదేనన్నాడు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడని గౌతమ్ గంభీర్‌లాంటి వ్యక్తి.. పాకిస్థాన్ జట్టుకు కోచ్‌గా ఉంటే జట్టుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
బాబర్ అజమ్‌పై వేటు?
కాగా సరిగ్గా రాణించలేనందున పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌ను మార్చే అవకాశమున్నట్లు ఆ దేశ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ పాక్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా రేసులో ఉన్నట్లు జియో న్యూస్ వెల్లడించింది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్‌లో బాబర్ విఫలం కావడంతో కెప్టెన్సీ మార్పుపై పరిశీలన జరుగుతున్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్ చేతిలో రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఓటమి చెందిన పాక్ టెస్ట్ టీమ్‌కు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఉన్నాడు. షాన్ మసూద్ టెస్ట్ కెప్టెన్సీపై వేటు వేయకుండా బాబర్ అజమ్‌ను వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించే యోచన సరికాదని అతని ఫ్యాన్స్ అంటున్నారు.