IPL Broadcasting Rights: ఐపీఎల్ హక్కుల కోసం అమెజాన్, రిలయన్స్ మధ్య పోటీ..?
IPL Broadcasting Rights: ఐపీఎల్ ప్రసార హక్కులు పొందేందుకు అమెజాన్, రిలయన్స్ మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. వచ్చే ఐదేళ్ల కోసం ఐపీఎల్ ప్రసార హక్కుల ధర రూ.40 వేల కోట్ల
IPL Broadcasting Rights: ఐపీఎల్ ప్రసార హక్కులు పొందేందుకు అమెజాన్, రిలయన్స్ మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. వచ్చే ఐదేళ్ల కోసం ఐపీఎల్ ప్రసార హక్కుల ధర రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధిక మంది వీక్షించే ఐపీఎల్ కోసం అన్ని కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. 2018 నుంచి 2022 వరకూ రూ.16,347 కోట్లు చెల్లించి స్టార్ ఇండియా హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రెండు పెద్ద కంపెనీలు అయిన అమెజాన్, రిలయన్స్, సోనీ కంపెనీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది.
సంప్రదాయ మీడియా సంస్థలు ఇప్పుడు భారతదేశం అతిపెద్ద రిటైలర్ రిలయన్స్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్ హక్కులు దక్కించుకునే ప్లాన్‌లో సోని పిక్చర్స్‌తో కలిసి అమెజాన్ బిడ్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 21 వేల కోట్లకు పైగానే మార్కెట్ వర్గాలు అంచనా ప్రకారం శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్రసార హక్కుల కోసం ప్రైమ్ వీడియోస్, సోని పిక్చర్స్ సంయుక్తంగా 3 నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నాయి.
ఐపీఎల్ ప్రసార హక్కులు 2012 నుంచి 2017 సోనీ గ్రూపు చేతిలో ఉండేవి. ఆ తర్వాత జరిగిన వేలంలో సోనీ గ్రూపు ఐదేళ్ల కాలపరిమితికి రూ. 11వేల 50 కోట్లతో బిడ్ దాఖలు చేయగా స్టార్, హాట్‌స్టార్‌లు కలిసి రూ. 16వేల 348 కోట్లు దాఖలు చేశాయి. అలా సోని ప్రసార హక్కులు స్టార్ గ్రూప్‌కి వెళ్లాయి. రిలయన్స్ తన బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ వెంచర్ వయాకామ్18 కోసం 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించడానికి విదేశీయులతో సహా ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. ఐపీఎల్ హక్కులు చివరకు ఏ కంపెనీకి వెళుతాయో వేచి చూడాలి.