AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నక్క తోక తొక్కావా ఏంది బ్రో.. 140 KMPH వేగంతో బంతి తాకిన బెయిల్స్ పడలే.. వీడియో చూస్తే షాకే..

Alex Carey Lucky Escape: తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మరో మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కెమర్ రోచ్ మూడు వికెట్లు, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీశారు.

Video: నక్క తోక తొక్కావా ఏంది బ్రో.. 140 KMPH వేగంతో బంతి తాకిన బెయిల్స్ పడలే.. వీడియో చూస్తే షాకే..
Alex Carey Lucky Escap Vide
Venkata Chari
|

Updated on: Jan 27, 2024 | 11:49 AM

Share

AUS vs WI 2nd Test: సాధారణంగా గంటకు 140 కి.మీ వేగంతో బంతి స్టంప్‌లకు తగిలితే పడిపోవడం ఖాయం. అయితే బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. బంతి 140 కి.మీ వేగంతో స్టంప్‌కు తగిలినా వికెట్ గానీ, బెయిల్‌ గానీ పడలేదు. దీంతో బ్యాటర్ నాలౌట్‌గా నిలిచాడు. ఇది చూసి వెస్టిండీస్ బౌలింగ్ జట్టు కూడా ఆశ్చర్యపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్‌ను వెస్టిండీస్ యువ పేసర్ షమర్ జోసెఫ్ బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ కారీ స్ట్రైక్‌లో ఉన్నాడు. ఈ ఓవర్‌లో జోసెఫ్ వేసిన రెండో బంతి బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో ఉంది. అది వేగంగా లోపలికి వచ్చింది. కారీ బ్యాట్‌ను స్వింగ్ చేస్తున్నప్పుడు, బంతి వికెట్ కీపర్ గ్లౌస్‌లో పడింది. ఓ దశలో బంతి బ్యాట్‌కు తగిలి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లిందని జోసెఫ్, వెస్టిండీస్ ఫీల్డర్లు భావించారు. అంతా అప్పీల్ చేశారు. కానీ, అంపైర్ నితిన్ మీనన్ అతడిని నాటౌట్‌గా ప్రకటించాడు.

బంతి స్టంప్‌కు తగిలినా బెయిల్స్ పడలే..

ఆ తర్వాత గంటకు 140 కి.మీ వేగంతో షామర్ జోసెఫ్ వేసిన ఈ బంతి బెయిల్స్‌ను తాకి వికెట్ కీపర్ గ్లోవ్స్‌లోకి వెళ్లడం రీప్లేలో కనిపించింది. ఇంత వేగంతో బంతి స్టంప్‌కు తగిలినా బెయిల్స్ కింద పడకుండా వికెట్లపైనే తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్..

అంతకుముందు బ్రిస్బేన్ టెస్టు రెండో రోజైన శుక్రవారం వెస్టిండీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కెవిన్ సింక్లెయిర్, జాషువా డిసిల్వా అర్ధ సెంచరీలు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మరో మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కెమర్ రోచ్ మూడు వికెట్లు, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీశారు. అయితే, దీని తర్వాత అలెక్స్ కారీ, ఉస్మాన్ ఖవాజా మధ్య మంచి భాగస్వామ్యం కుదిరింది. ఈ వార్త రాసే వరకు ఇద్దరూ ఆరో వికెట్‌కు 50కి పైగా పరుగులు జోడించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..