5 నగరాల్లో టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు.. తెలుగు రాష్ట్రాలకు హ్యాండిచ్చిన బీసీసీఐ.. ఫైనల్ ఎక్కడంటే?
Men's T20 World Cup 2026: పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026ను భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ (Women's ODI World Cup) తరహాలోనే, ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ (Pakistan) జట్టు భారత్‌కు ప్రయాణించదు. ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంక (Sri Lanka) లోనే ఆడనుంది. ఈ ముఖ్యమైన టీ20 టోర్నమెంట్ (T20 tournament) వచ్చే ఏడాది మార్చి మరియు ఏప్రిల్ మధ్య జరిగే అవకాశం ఉంది.

T20 World Cup 2026: వచ్చే ఏడాది భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత్‌లోని ఐదు ప్రధాన నగరాలను వేదికలుగా షార్ట్‌లిస్ట్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
షార్ట్‌లిస్ట్ చేసిన నగరాలు..
బీసీసీఐ (BCCI) ఎంపిక చేసిన ఐదు నగరాలు Tier 1 సిటీస్‌గా ఉన్నాయి. నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) ఉన్న అహ్మదాబాద్ (Ahmedabad) ఫైనల్‌కు (T20I World Cup 2026 Final) ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
1. అహ్మదాబాద్ (Ahmedabad)
2. న్యూ ఢిల్లీ (New Delhi)
3. కోల్‌కతా (Kolkata)
4. చెన్నై (Chennai)
5. ముంబై (Mumbai)
గతంలో 2023 వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) ఫైనల్‌కు కూడా అహ్మదాబాద్ ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచకప్‌ను తక్కువ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు, తద్వారా ప్రతి వేదికకు ఎక్కువ మ్యాచ్‌లు కేటాయించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
పాకిస్థాన్ మ్యాచ్‌లు, సెమీ-ఫైనల్స్..
పాకిస్థాన్ (Pakistan) జట్టు ఆడే మ్యాచ్‌లు అన్నీ శ్రీలంక (Sri Lanka) లోని వేదికల్లోనే నిర్వహించాలని ఇప్పటికే ఒక ఒప్పందం ఉంది. పొలిటికల్ టెన్షన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒకవేళ పాకిస్థాన్ (Pakistan) ఫైనల్‌కు చేరుకుంటే, ఆ తుదిపోరును కొలంబో (Colombo) లోని తటస్థ వేదికకు తరలించే అవకాశం ఉందని కూడా సమాచారం.
శ్రీలంక (Sri Lanka) సెమీ-ఫైనల్స్‌కు (Semi-Finals) చేరుకుంటే, ఆ మ్యాచ్‌ను వారు స్వదేశంలోనే ఆడేలా ఐసీసీ నుంచి సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ త్వరలోనే ఈ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌నుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








