WPL 2026 Retention List : డబ్ల్యూపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్ విడుదల.. దీప్తి శర్మ, మెగ్ లానింగ్‌కు షాక్
: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ లిస్ట్ విడుదలైంది. నవంబర్ 6, గురువారం రిటెన్షన్ గడువు ముగియడంతో అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. ఈసారి రిటెన్షన్స్‌లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

WPL 2026 Retention List : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ లిస్ట్ విడుదలైంది. నవంబర్ 6, గురువారం రిటెన్షన్ గడువు ముగియడంతో అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. ఈసారి రిటెన్షన్స్‌లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇటీవలి మహిళల ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి శర్మతో పాటు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ను కూడా వారి వారి జట్లు విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం ఈ నెలాఖరు (నవంబర్ 27)లో జరగనుంది. ఈ సందర్భంగా ఏ జట్టు ఎంత మందిని రిటైన్ చేసుకుంది, విడుదలైన స్టార్ ప్లేయర్‌ల వివరాలు చూద్దాం.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 కోసం రిటెన్షన్ గడువు ముగిసింది. ఈసారి గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఫ్రాంఛైజీలు కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి శర్మతో పాటు, సౌతాఫ్రికాను ఫైనల్ వరకు తీసుకెళ్లిన లారా వోల్వార్ట్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ మెగ్ లానింగ్‌లను వారి జట్లు విడుదల చేయడం గమనార్హం.
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్ల చొప్పున రిటైన్ చేసుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నలుగురు ఆటగాళ్లను, గుజరాత్ జెయింట్స్ ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, యూపీ వారియర్స్ కేవలం ఒక్కే ఒక్క ప్లేయర్‌ను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, వారికి కేటాయించిన సొమ్ము వివరాలు తెలుసుకుందాం.
ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.2.5 కోట్లు), హీలీ మాథ్యూస్ (రూ.1.75 కోట్లు), నట్-సైవర్ బ్రంట్ (రూ.3.5 కోట్లు)తో సహా ఐదుగురిని రిటైన్ చేసుకుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రపంచకప్ అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే ఇంగ్లాండ్ క్రికెటర్ నట్ సైవర్-బ్రంట్‌కే ఎక్కువ ధర కేటాయించారు.
మెగ్ లానింగ్‌ను రిలీజ్ చేసిన ఢిల్లీ.. ఎనాబెల్ సదర్లాండ్, మారిజన్నె కాప్, జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, నిక్కీ ప్రసాద్ లను రిటైన్ చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన (రూ.3.5 కోట్లు), ఎలిస్ పెర్రీ (రూ.2 కోట్లు), రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్ లను అట్టిపెట్టుకుంది.
ఈ మెగా వేలం ప్రక్రియ నవంబర్ 27, 2025న నిర్వహించనున్నట్లు సమాచారం. జట్లకు ఆర్టీఎం (Right to Match) కార్డుల విషయంలో పెద్ద తేడాలు ఉన్నాయి. ఆర్టీఎం కార్డులు ఏ జట్టుకు అందుబాటులో లేవు. గతంలో ఉన్న నియమం ప్రకారం.. యూపీ వారియర్స్ 4 ఆర్టీఎం కార్డులతో, గుజరాత్ జెయింట్స్ 3 ఆర్టీఎం కార్డులతో, ఆర్‌సీబీ 1 ఆర్టీఎం కార్డుతో వేలంలోకి దిగనున్నాయి. ఎంఐ, డీసీలకు మాత్రం ఎలాంటి ఆర్టీఎం కార్డులు అందుబాటులో లేవు. డబ్ల్యూపీఎల్ చరిత్రలో మొదటిసారి ముంబై ఇండియన్స్, రెండోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మూడోసారి (2025) మళ్లీ ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఫుల్ స్కోర్ బోర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




