బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విధ్వంసం సృష్టించాడు. బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో 20కి పైగా వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఈ ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్ బుమ్రా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను తన బౌలింగ్‌తో ముప్పుతిప్పులు పెడుతున్నాడు. ఆస్ట్రేలియాలోని పెద్ద దిగ్గజాలు కూడా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మెల్‌బోర్న్‌లో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు బుమ్రా బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు వస్తున్నాయి.
ఇది చదవండి: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. బీకర ఫామ్‌లో కావ్య పాప ఏరికొరి తెచ్చుకున్న ప్లేయర్..
మెల్‌బోర్న్ టెస్టుకు ముందు బుమ్రా బౌలింగ్ యాక్షన్‌పై చర్చ మొదలైంది. ఆస్ట్రేలియాకు చెందిన అనుభవజ్ఞుడైన క్రికెట్ బ్రాడ్‌కాస్టర్ ఇయాన్ మోరిస్ తన బౌలింగ్ యాక్షన్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు. అతను తన X హ్యాండిల్‌పై ఇలా రాశాడు, ‘భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా బౌలింగ్‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదు? బుమ్రా విసురుతున్నాడని నేను అనడం లేదు. బంతి వదిలేటప్పుడు అతని పొజిషన్ గురించి విశ్లేషించాలని చెప్తున్నా’ అని ట్విట్ చేశాడు. బుమ్రా బౌలింగ్ యాక్షన్‌పై ప్రశ్నలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు బుమ్రా తన యూనిక్ బౌలింగ్ యాక్షన్ కారణంగా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పెర్త్ టెస్టులో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేసినప్పుడు, అతని బౌలింగ్ యాక్షన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా 6 ఇన్నింగ్స్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. గబ్బా టెస్టులో అతను ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కూడా నిలిచాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో 20 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 53 వికెట్లు తీశాడు. ఈ విషయంలో వెటరన్ కపిల్ దేవ్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. కపిల్ దేవ్ ఆస్ట్రేలియాలో 51 టెస్టు వికెట్లు తీశాడు.
ఇది చదవండి: క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి