టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ సతీసమేతంగా ఉజ్జయని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నాడు. భార్య అథియా శెట్టితో కలిసి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. గత నెలలలోనే రాహుల్- అథియా శెట్టి పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. అయితే వివాహమైన వెంటనే ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ ఉండడంతో వెంటనే జట్టులోకి వచ్చాడు. అయితే మూడు టెస్టుకు ముందు కాస్త విరామం లభించడంతో అతియాతో కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన రాహుల్ – అథియాలు బాబా మహాకాళ ఆశీర్వాదం తీసుకున్నారు. వీళ్లు ఆలయంలో పూజ నిర్వహిస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఉజ్జయినిలోని ప్రతిష్ఠాత్మకమైన ఈ ఆలయాన్ని జనవరి నెలలో టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ దర్శించుకున్నారు. కారు యాక్సిడెంట్‌లో గాయపడ్డ వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
మరోవైపు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమయ్యాడు రాహుల్. అంతగా ఫామ్‌లో లేని ఈ స్టార్ ఓపెనర్ మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 38 రన్స్ చేశాడు. దీంతో అతనిని వైస్ కెప్టెన్‌గా తప్పించారు. మార్చి 1న ఇండోర్‌లో జరిగే మూడో టెస్టుకు తుది జట్టులో అతనికి చోటు దక్కడం దాదాపు కష్టమేనంటున్నారు. ఇక రాహుల్ స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాహుల్ కు కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మద్దతుగా నిలుస్తున్నారు.
KL Rahul and Athiya Shetty at the Mahakaleshwar Jyotirlinga Temple. pic.twitter.com/KQ1q04nuYg
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..