IND vs AUS: 2023లోనే కాదు.. 2024లోనూ టీమిండియా బిజీనే.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..
IND vs AUS T20 Series: ఈ ఏడాదే కాదు.. వచ్చే ఏడాది కూడా భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ పుల్ బిజీగా మారిపోయింది. 2023 అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత టీ20, టెస్టులపైనే టీమిండియా దృష్టి సారిస్తుంది.

India vs Australia T20 Series Schedule: ఈ ఏడాదే కాదు.. వచ్చే ఏడాది కూడా భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ పుల్ బిజీగా మారిపోయింది. 2023 అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత టీ20, టెస్టులపైనే టీమిండియా దృష్టి సారిస్తుంది. వాస్తవానికి వచ్చే ఏడాది 2024లో టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి భారత్ మిషన్ టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది.
కాగా, ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరనుంది. అయితే, ఆ తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. నివేదిక ప్రకారం, జనవరి, ఫిబ్రవరిలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు రానుంది. దీని తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది.




2023 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా షెడ్యూల్..
డిసెంబరులో – ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల T20 సిరీస్
డిసెంబర్-జనవరి – దక్షిణాఫ్రికా పర్యటనలో రెండు టెస్టులు, మూడు ODIలు, మూడు T20లు..
జనవరి-ఫిబ్రవరి – స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్..
మార్చి – స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
జులై – శ్రీలంకలో భారత పర్యటన (3 ODIలు, 3 T20Iలు)
సెప్టెంబర్-అక్టోబర్ – స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు..
అక్టోబర్-నవంబర్ – స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు.
ఈ ఏడాది కూడా టీమ్ ఇండియా షెడ్యూల్ బిజీ..
ఈ ఏడాది ఇప్పటి వరకు టీమిండియా ఫుల్ యాక్షన్‌లో కనిపించింది. అదే సమయంలో, టీమ్ ఇండియా షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. భారత జట్టు జులై 12 నుంచి కరేబీయన్ టీంతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్, ఆపై ఐర్లాండ్‌తో సిరీస్. అదే సమయంలో, 2023 వన్డే ప్రపంచ కప్ అక్టోబరు-నవంబర్‌లో జరుగుతుంది. ఇందులో టీమ్ ఇండియా అత్యధికంగా ప్రయాణించనుంది. ప్రపంచకప్‌లో టీమిండియా తన మ్యాచ్‌లను దేశంలోని 9 వేర్వేరు నగరాల్లో ఆడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




