ఐసీసీ ప్రపంచకప్ 2019లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గుల్బదిన్ నయీబ్‌పై వేటు పడింది. ఐపీఎల్ సూపర్ స్టార్ రషీద్ ఖాన్‌ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) శుక్రవారం ప్రకటించింది. ప్రపంచకప్ ముందు అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన అస్ఘర్ అఫ్ఘాన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ‘అన్ని ఫార్మాట్లకు సారథిగా రషీద్ ఖాన్‌కు బాధ్యతలు అప్పగించాం. ఇతనికి డిప్యూటీగా అస్ఘర్ వ్యవహరిస్తాడు’ అని ఏసీబీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ACB Chairman @AzizullahFazli announced today that All-rounder @rashidkhan_19 has been appointed as team Afghanistan’s new captain across all three formats replacing @GbNaib while Asghar Afghan will serve as the Vice-captain.
Read more: https://t.co/UF7MZgdcnj pic.twitter.com/w3SYvEAHiW
— Afghanistan Cricket Board (@ACBofficials) July 12, 2019
@rashidkhan_19 appointed as Team Afghanistan's new Captain across all three formats while Asghar Afghan appointed as Vice-Captain. pic.twitter.com/s78Nso67aF
— Afghanistan Cricket Board (@ACBofficials) July 12, 2019