World Cup 2023: ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘన్ జట్టు.. కోహ్లీ విరోధికి ఛాన్స్.. పార్ట్-2కి రెడీ అంటోన్న ఫ్యాన్స్..

|

Sep 13, 2023 | 8:34 PM

ICC ODI World Cup 2023 Afghanistan Squad: వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌లు ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్‌లు మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. అఫ్ఘానిస్థాన్ జట్టు అక్టోబర్ 7న బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో కలిసి నవీన్-ఉల్-హక్ వైరల్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్‌లో కింగ్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య పోటీ ఎలా ఉంటుందోనని ఊహించారు. కానీ, అఫ్గాన్ జట్టులో చోటు దక్కించుకోవడంలో యువ పేసర్ విఫలమయ్యాడు.

World Cup 2023: ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘన్ జట్టు.. కోహ్లీ విరోధికి ఛాన్స్.. పార్ట్-2కి రెడీ అంటోన్న ఫ్యాన్స్..
Afghanistan Squad
Follow us on

World Cup 2023 Afghanistan Squad: అక్టోబర్‌ – నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి హష్మతుల్లా షాహిదీ నేతృత్వం వహిస్తారు. ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువ పేసర్ నవీన్ ఉల్ హక్ ఈసారి జట్టులోకి ఎంపిక కావడం విశేషం.

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో కలిసి నవీన్-ఉల్-హక్ వైరల్ అయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో గొడవ పడిన నవీన్ ఉల్ హక్.. ఆ తర్వాత కూడా కోహ్లీని, ఆర్‌సీబీ జట్టును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులో పెట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ, ఆన్ ఫీల్డ్ నుంచి సోషల్ మీడియాకు చేరింది. ఈ క్రమంలోనే ఆసియా కప్‌లో కింగ్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య పోటీ ఎలా ఉంటుందోనని ఊహించారు. ఆసియా కప్ 2023లో నవీన్‌కు చోటు దక్కుతుందని అంతా ఊహించారు. కానీ, అఫ్గాన్ జట్టులో చోటు దక్కించుకోవడంలో యువ పేసర్ విఫలమయ్యాడు. ఇప్పుడు నవీన్ ఉల్ హక్ వన్డే ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. అందుకే అక్టోబర్ 11న జరిగే భారత్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో టఫ్ ఫైట్ కోసం ఎదురుచూడవచ్చు.

ఇవి కూడా చదవండి

రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, రహ్మానుల్లా గుర్బాజ్, ముజీబ్ ఉర్ రెహమాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్టులో స్టార్ ప్లేయర్‌లుగా కనిపించారు. వీరితో పాటు సీనియర్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మాలిక్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.

ఈ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. అఫ్ఘానిస్థాన్ జట్టు అక్టోబర్ 7న బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ కప్ జట్టు..

హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్ హక్.

రిజర్వ్‌లు: గుల్బాదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మాలిక్.

ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించిన 15 మంది సభ్యుల వివరాలు ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..