AFG vs BAN: 12.1 ఓవర్లలో కొట్టాల్సిందే.. ఆసక్తికరంగా బంగ్లా, ఆఫ్ఘాన్ సెమీస్ రేస్.. వేచి చూస్తోన్న ఆస్ట్రేలియా..

AFG vs BAN, T20 World Cup 2024: మంగళవారం సెయింట్ విన్సెంట్‌లోని కింగ్‌స్‌టౌన్‌లో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే పరిమితమైంది. బంగ్లాదేశ్ జట్టు అద్భుతమైన బౌలింగ్‌తో ఆఫ్గాన్ జట్టును తక్కువ స్కోర్‌కే పరిమిత చేసింది. ఈ మ్యాచ్ మూడు జట్లకు చాలా కీలకంగా మారింది. బంగ్లాదేశ్ భారీ తేడాతో గెలిస్తే, సెమీస్ చేరే అవకాశం ఉంది.

AFG vs BAN: 12.1 ఓవర్లలో కొట్టాల్సిందే.. ఆసక్తికరంగా బంగ్లా, ఆఫ్ఘాన్ సెమీస్ రేస్.. వేచి చూస్తోన్న ఆస్ట్రేలియా..
Afg Vs BanImage Credit source: X, Hotstar
Follow us

|

Updated on: Jun 25, 2024 | 8:19 AM

AFG vs BAN, T20 World Cup 2024: మంగళవారం సెయింట్ విన్సెంట్‌లోని కింగ్‌స్‌టౌన్‌లో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే పరిమితమైంది. బంగ్లాదేశ్ జట్టు అద్భుతమైన బౌలింగ్‌తో ఆఫ్గాన్ జట్టును తక్కువ స్కోర్‌కే పరిమిత చేసింది. ఈ మ్యాచ్ మూడు జట్లకు చాలా కీలకంగా మారింది. బంగ్లాదేశ్ భారీ తేడాతో గెలిస్తే, సెమీస్ చేరే అవకాశం ఉంది. అలాగే, ఆఫ్ఘాన్ నామమాత్రంగా గెలిచినా.. సెమీస్‌కు చేరుతుంది. బంగ్లాదేశ్ భారీ తేడాతో గెలవకపోతే, ఆస్ట్రేలియాకు ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో బంగ్లా, ఆప్ఘాన్ మ్యాచ్‌ కీలకంగా మారింది. అయితే, ఆఫ్గాన్ ఇన్నింగ్ ముగిసిన అనంతరం, వర్షం ప్రారంభం కావడంతో ఆట కొద్దిసేపు ఆగింది.

ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వాలంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ లక్ష్యాన్ని 47 బంతుల్లో ఛేదించాల్సి ఉంది. తక్కువ తేడాతో గెలిస్తే ఆస్ట్రేలియా జట్టు ఇంటికి పోతుంది.

అంటే 12.1 ఓవర్లలో 116 పరుగులు చేయాలి. 12.4 ఓవర్లలో స్కోర్‌లను సమం చేసి, ఆపై సిక్సర్‌తో ముగించినట్లయితే అది కూడా అర్హత పొందవచ్చు. అయితే, వర్షం ఆలస్యం కారణంగా, ఓవర్లను తగ్గిస్తే ఈ సమీకరణం మారవచ్చు.

ఈ పోటీలో విజయం సాధిస్తేనే ఆఫ్ఘనిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకోగలదు. అలా కాక వర్షంతో మ్యాచ్ వాష్ అవుట్ అయినా.. ఆఫ్ఘాన్ సెమీస్ రేసులో ఉంటుంది.

టాస్ గెలిచినా దక్కని ప్రయోజనం..

తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 5 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ జట్టు ఆరంభం చాలా నెమ్మదిగా సాగింది. ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ 10.4 ఓవర్లలో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్బాజ్, జద్రాన్ పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోలేకపోయారు. జద్రాన్‌ను అవుట్ చేయడం ద్వారా లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. భాగస్వామ్యానికి బ్రేక్ పడిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 43 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ 19 నాటౌట్, ఇబ్రహీం జద్రాన్ 18, అజ్మతుల్లా ఒమర్జాయ్ 10 పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ తరపున రిషాద్‌ హుస్సేన్‌ 3 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.

రెండు జట్ల ప్లేయింగ్ XI ..

ఆఫ్ఘనిస్థాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికె), ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, కరీం జనత్, నంగేలియా ఖరోటే, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూకీ.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తంజీద్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..