- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024 Team India Captain Rohit Sharma Smashed 92 Runs In Just 41 Balls Against Australia
Rohit Sharma: 8 సిక్సర్లు, 7 ఫోర్లు.. బౌండరీలతో రికార్డుల వర్షం కురిపించిన రోహిత్.. అవేంటంటే?
IND vs AUS, T20 World Cup 2024: తన తుఫాన్ బ్యాటింగ్‌తో కేవలం 10 ఓవర్లలోనే జట్టును 100 పరుగులకు చేర్చిన రోహిత్.. సెంచరీ బాట పట్టాడు. అలాగే సూర్యకుమార్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు. కానీ, ఆ ఓవర్లో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
Updated on: Jun 25, 2024 | 8:37 AM

సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 రౌండ్ చివరి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తుఫాన్ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. ఇది విజయంలోనూ కీలకంగా మారింది.

ఈ మ్యాచ్‌లో ఎప్పటిలాగే విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ.. తొలి ఓవర్ మూడో బంతికే బౌండరీతో ఖాతా తెరిచాడు. ఇక్కడి నుంచి ఆసీస్ పేసర్లపై దాడి కొనసాగించిన రోహిత్.. సిక్సుల వర్షంతో మైదానాన్ని తడిపేశాడు.

మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ శర్మ 4 సిక్సర్లు, 1 బౌండరీతో 28 పరుగులు పిండుకున్నాడు. దీంతో కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ ఇక్కడితో ఆగకుండా కంగారూ బౌలర్లకు చెమటలు పట్టించాడు.

తన తుఫాన్ బ్యాటింగ్‌తో కేవలం 10 ఓవర్లలోనే జట్టును 100 పరుగులకు చేర్చిన రోహిత్.. సెంచరీ బాట పట్టాడు. అలాగే సూర్యకుమార్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు. కానీ, ఆ ఓవర్లో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

చివరగా రోహిత్ శర్మ 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 224.38 స్ట్రైక్ రేట్‌తో 92 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

అంతేకాదు ఈ మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 200 సిక్సర్ల మార్క్‌ను కూడా దాటేశాడు.





























