- Telugu News Photo Gallery Cricket photos Rain Interrupts AFG Vs BAN T20 World Cup 2024 Match, If DLS Method On Roll, Australia Seals Semi final Spot
AFG Vs BAN: వర్షం దోబూచులాటతో మారిన లెక్కలు.. అదే జరిగితే సెమీఫైనల్‌కి ఆస్ట్రేలియా.!
సూపర్8 గ్రూప్-1లో పోరు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే టీమిండియా సెమీఫైనల్ స్పాట్ ఖరారు చేసుకుంది. జూన్ 27న గయానా వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Updated on: Jun 25, 2024 | 9:28 AM

సూపర్8 గ్రూప్-1లో పోరు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే టీమిండియా సెమీఫైనల్ స్పాట్ ఖరారు చేసుకుంది. జూన్ 27న గయానా వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది.

ఇదిలా ఉంటే.. గ్రూప్-1లో మరో సెమీఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేసు మొదలైంది. కింగ్‌స్టన్‌లో జరుగుతోన్న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ దీనికి విజేతను నిర్ణయించనుంది.

ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 12.1 ఓవర్లలో చేధించినట్లయితే.. బంగ్లాదేశ్ జట్టు సెమీఫైనల్ చేరుకుంటుంది. మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలబడుతుంది.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ గెలిచినా.. లేదా వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా.. రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని ఆఫ్ఘన్ జట్టు సరాసరి సెమీఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంటుంది.

ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన టార్గెట్‌ను బంగ్లాదేశ్ జట్టు 12.1 ఓవర్ల తర్వాత చేధిస్తే.. ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరుతుంది. అంతేకాదు ప్రస్తుతం ఈ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారడంతో 5 ఓవర్ల డక్‌వర్త్ లూయిస్ పరిగణనలోకి తీసుకున్నా.. ఆస్ట్రేలియా సెమీస్‌కి చేరే అవకాశం ఉంది.





























