- Telugu News Photo Gallery Cricket photos Arshdeep Singh becomes most wicket taker for India in T20 World Cup, breaks RP Singh's record
Arshdeep Singh: 4 ఓవర్లలో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. 17 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన అర్షదీప్.. అదేంటంటే?
Arshdeep Singh Breaks RP Singh Record: T20 ప్రపంచ కప్ 2024 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో , భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన పేరు మీద భారీ రికార్డును సృష్టించాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఆర్పీ సింగ్ పేరిట ఉండగా ఇప్పుడు అర్ష్దీప్ సింగ్ తన రికార్డుతో లిఖించుకున్నాడు.
Updated on: Jun 25, 2024 | 1:58 PM

2024 T20 ప్రపంచ కప్‌లో అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన చాలా బాగుంది. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాపై కూడా మంచి ఆటతీరు కనబరిచాడు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

దీంతో 2024 టీ20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్ సింగ్ 15 వికెట్లు తీశాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆర్పీ సింగ్ పేరిట ఉండేది. 2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో 12 వికెట్లు పడగొట్టాడు. ఆ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది.

అర్ష్‌దీప్ సింగ్ గురించి మాట్లాడితే T20 ప్రపంచ కప్ 2024లో ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో 15 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు ఫజల్‌హాక్ ఫరూఖీ 16 వికెట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్నాడు.

ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే.. ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో ఓడించి భారత్ సెమీస్‌లో చోటు దక్కించుకుంది. టీమ్ ఇండియా 20 ఓవర్లలో 205/5 స్కోరు చేసింది. సమాధానంగా, ఆస్ట్రేలియా జట్టు మొత్తం ఓవర్లు ఆడి 181/7 మాత్రమే చేయగలిగింది. ఇప్పుడు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరపున కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన అతను ఓవరాల్ గా 41 బంతుల్లో 92 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు కొట్టాడు.