Viral Video: అబుదాబి టీ10 లీగ్ సందర్భంగా పాక్ అంపైర్ అలీమ్ దార్‌కు ప్రమాదం జరిగింది. చెన్నై బ్రేవ్స్ వర్సెస్ నార్తర్న్ వారియర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా అతని తల వెనుక భాగంలో పదునైన త్రో తగిలింది. 53 ఏళ్ల అలీమ్ బంతిని తప్పించుకోవడానికి పరిగెడుతున్నాడు. కానీ, అతను తప్పించుకోలేకపోయాడు. బంతి తగిలిన అలీమ్ నొప్పితో ఇబ్బంది పడుతూ కనిపించాడు. అనంతరం ఫిజియోను మైదానంలోకి పిలిపించి దార్‌ను పరిశీలించారు. అదే సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు కూడా అంపైర్ గాయానికి మసాజ్ చేస్తూ కనిపించారు. అయితే, అతని గాయం చాలా ప్రమాదకరమైనది కాదు. అయితే అతను తప్పించుకునే ప్రయత్నంలో గాయపడిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్‌లో కూడా అలీమ్ తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో అలీమ్ దార్ బంతి గాయంతో బయటపడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న ఆఫ్రికన్ ప్లేయర్ రాస్సీ వాన్ డెర్ డుసెన్ క్యాచ్‌కు ప్రయత్నించగా, బంతి చాలా వేగంగా అతని చేతి నుంచి పైకి వెళ్లింది. ఆ తరువాత డస్సెన్ బంతిని క్యాచ్ చేసి, బౌలింగ్ ఎండ్‌లో వేగంగా విసిరాడు. అంపైర్ అలీమ్ దార్ త్రో నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
అంతకుముందు ఇదే మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కొట్టిన షాట్ కూడా అతని తలకు తగిలింది. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి ఆయనకు సారీ చెప్పారు. అంపైర్ల భద్రతపై చాలాసార్లు ప్రశ్నలు తలెత్తాయి. అంపైర్లు హెల్మెట్ ధరించడంపై కూడా చర్చ జరుగుతోంది. చాలా మంది అంపైర్లు హెల్మెట్ ధరించి కనిపించారు. కానీ ఇది పూర్తిగా అమలు కాలేదు. మరోసారి ఈ అంశంపై చర్చలు నడుస్తున్నాయి.
Aleem Dar ?? pic.twitter.com/Zp0mL8xwj6
— Stay Cricket (@staycricket) November 24, 2021
Also Read: Rahane- Pujara Trolls: మరోసారి విఫలమైన ఆ ఇద్దరూ.. టీమిండియా నుంచి తీసేయడంటూ తీవ్రమైన ట్రోల్స్..!
IND vs NZ, live, 1st Test, Day 4: ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. అశ్విన్ (32) ఔట్