AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: సూర్య రికార్డు బద్దలవుతుందా? అభిషేక్, ఇషాన్ ముందున్న భారీ టార్గెట్ ఇదే

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 22 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డుపై అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కన్నేశారు. సూర్య రికార్డును అధిగమించాలంటే ఇషాన్‌కు ఎన్ని సిక్సర్లు కావాలి? అభిషేక్ లక్ష్యం ఎంత? అనేది తెలుసుకుందాం.

IND vs NZ: సూర్య రికార్డు బద్దలవుతుందా? అభిషేక్, ఇషాన్ ముందున్న భారీ టార్గెట్ ఇదే
Abhishek Sharma Ishan Kishan
Rakesh
|

Updated on: Oct 19, 2026 | 3:36 PM

Share

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసుకుంది. ఆ సిరీస్‌లో బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించడం టీంకు సానుకూల అంశంగా మారింది. ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై కూడా అదే దూకుడును కొనసాగించాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌తో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ టిం సీఫర్ట్ కూడా ఓ కీలక రికార్డుపై కన్నేశారు.

సూర్యకుమార్ పేరిట ఉన్న రికార్డు ఇదే

భారత్‌–న్యూజిలాండ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. కివీస్‌పై 14 మ్యాచ్‌లు ఆడిన సూర్య 526 పరుగులు చేసి 29 సిక్సర్లు బాదాడు. అతడి తర్వాత రోహిత్ శర్మ 27 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫర్ట్ 26 సిక్సర్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ రికార్డును అందుకోవాలంటే బ్యాటర్లు తమ సిక్సర్ల లెక్కను మరింత పెంచుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Rinku Singh: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రింకూ సింగ్.. టాప్ 10లో చోటు

ఇషాన్‌కు 8 సిక్సర్లు.. అభిషేక్‌కు 12 అవసరం

ఈ జాబితాలో ఇషాన్ కిషన్ ఆరో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ 372 పరుగులు చేసి 22 సిక్సర్లు కొట్టాడు. సూర్యకుమార్ రికార్డును అధిగమించాలంటే అతడు మరో ఎనిమిది సిక్సర్లు బాదాలి. మరోవైపు అభిషేక్ శర్మ కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 234 పరుగులు సాధించి 18 సిక్సర్లు కొట్టాడు. అతడు సూర్య రికార్డును దాటాలంటే మరో 12 సిక్సర్లు బాదాల్సి ఉంటుంది. అభిషేక్‌కు ఉన్న దూకుడు, ఇషాన్‌కు ఉన్న భారీ షాట్లు ఆడే సామర్థ్యాన్ని చూస్తే ఈ రికార్డు రేసు ఆసక్తికరంగా మారనుంది.

సిక్సర్ల జాబితాలో టాప్-10 బ్యాటర్లు

భారత్‌–న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ 29 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 27, టిమ్ సీఫర్ట్ 26, కొలిన్ మున్రో 24, మార్టిన్ గప్టిల్ 23 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇషాన్ కిషన్ 22 సిక్సర్లతో ఆరో స్థానంలో ఉండగా, డారిల్ మిచెల్ 19, అభిషేక్ శర్మ 18 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. శివమ్ దూబే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ కూడా చెరో 16 సిక్సర్లతో ఈ జాబితాలో చోటు సంపాదించారు.

ఇది కూడా చదవండి: IND vs NZ: భారత్ వర్సెస్ కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్ ?

గత అనుభవాలు ఉపయోగపడతాయా ?

వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-2తో నిలిచింది. బెంగళూరులో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ 200కు పైగా పరుగులు చేయడం బ్యాటింగ్ విభాగానికి సానుకూల అంశమని వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో నితీశ్ రెడ్డి, శివమ్ దూబేలకు ఆల్‌రౌండర్లుగా అవకాశం ఇచ్చామని, వారు మంచి ప్రదర్శన చేశారని చెప్పాడు. నమన్ ధీర్ కూడా ఒత్తిడిలో బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. అయితే బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అంశాలు ఉన్నాయని అంగీకరించాడు.

Follow Us