World Cup 2023: భారత్‌లో క్రికెటర్లకు స్వేచ్ఛ ఉండదు.. విషం కక్కిన మరో పాక్ ప్లేయర్.. ఫ్యాన్స్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన సంగతి పక్కన పెడితే.. ఆ జట్టు మాజీ క్రికెటర్లు భారత్‌పై విషం కక్కుతున్నారు. టీవీ స్టూడియోల్లో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికే హసన్ రాజా టీమిండియా బౌలర్లపై ఛీటింగ్ ఆరోపణలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ కూడా ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన బాబర్ సేన 4 విజయాలు, 4 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. సెమీస్ చేరాలంటే పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారీ విజయం సాధించాల్సి ఉంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన సంగతి పక్కన పెడితే.. ఆ జట్టు మాజీ క్రికెటర్లు భారత్‌పై విషం కక్కుతున్నారు. టీవీ స్టూడియోల్లో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికే హసన్ రాజా టీమిండియా బౌలర్లపై ఛీటింగ్ ఆరోపణలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ కూడా ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో అసలు స్వేచ్ఛ ఉండంటూ ఓ టీవీ స్టూడియలో చెప్పాడు రజాక్. ‘భారతదేశంలో స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ ఆటగాళ్లు హోటల్ నుండి కనీసం బయటకు కూడా వెళ్లలేరు. ఎలాంటి ఎంజాయ్‌మెంట్ ఉండదు. భారత్‌లో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ హోటల్‌లోనే ఉండిపోవాల్సిందే. క్రికెటర్లు మైదానంలో మంచి ప్రదర్శన ఇవ్వాలంటే స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ లేకపోతే ఆటగాడు గ్రౌండ్‌లో రాణించలేడు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు రజాక్. దీనిపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్‌లో పాక్ క్రికెటర్లకు లభించిన ఆతిథ్యాన్ని గుర్తుచేస్తున్నారు.
కాగా ప్రపంచకప్ కోసం భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి పాకిస్థాన్ జట్టుకు ఇక్కడ అద్భుతమైన ఆతిథ్యం లభిస్తోంది. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వరకు దాయాది ఆటగాళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారి ఆహారం, డ్రింక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యున్నత సౌకర్యాలు, సదుపాయాలను అందిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో బిర్యానీలు కూడా ఆస్వాదించారు. స్వయంగా పాక్ క్రికెటర్లు హైదరాబాద్ ఆతిథ్యాన్ని మెచ్చుకున్నారు. అయితే పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం ఇవన్నీ కనిపించడం లేదంటూ టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అబ్దుల్ రజాక్ కామెంట్స్..
‘There is no freedom in India, you cannot go out of hotels and enjoy yourself. The security in India is too tight and you are always stuck in hotels. A player needs freedom and he cannot perform when there are so many restriction on him’ – Abdul Razzaq 👀 #CWC23 #NZvsSL pic.twitter.com/sskZ84tQzg
— Farid Khan (@_FaridKhan) November 9, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..