T20 World Cup: ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే కాపాడాలి.!

|

May 02, 2024 | 5:36 PM

టీ20 ప్రపంచకప్ 2024కి బరిలో దిగే టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనుండగా.. అతడికి డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది భారత సెలెక్షన్ కమిటీ. జట్టు ఎంపికలో పలు సంచనాలు

T20 World Cup: ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే కాపాడాలి.!
Team India
Follow us on

టీ20 ప్రపంచకప్ 2024కి బరిలో దిగే టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనుండగా.. అతడికి డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది భారత సెలెక్షన్ కమిటీ. జట్టు ఎంపికలో పలు సంచనాలు నమోదవుతాయని అందరూ ఊహించినా.. అదే 2022లో పాల్గొన్న జట్టులోని దాదాపుగా 9 మంది సభ్యులను ఎంచుకున్నారు బీసీసీఐ సెలెక్టర్లు. అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.! అటు కెప్టెన్‌గా, ఇటు బౌలర్, బ్యాటర్‌గా ఐపీఎల్‌లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్న హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు ఇవ్వడంతో పాటు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. దీంతో ఆ ఎంపిక, ఈ 15 మంది సభ్యులపై ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అలాగే నెగటివ్ కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2022 టీ20 ప్రపంచకప్‌లో భాగమైన 9 మంది ప్లేయర్లు.. ఈసారి కూడా ఛాన్స్ దక్కించుకోగా.. వారితో పాటు ఐపీఎల్ ప్రదర్శనలు ఆధారంగా మరికొందరు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. అయితే రింకూ సింగ్, దినేష్ కార్తీక్, కెఎల్ రాహుల్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, శుభ్‌మాన్ గిల్ లాంటి వారు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే వీరందరికీ మొండిచెయ్యి ఇచ్చింది బీసీసీఐ.

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రాలకు ఇది వరుసగా రెండో టీ20 ప్రపంచకప్. ఇక మహమ్మద్ సిరాజ్, బుమ్రా, అర్షదీప్ లాంటి స్వింగ్ బౌలర్లతో టీమిండియా మెగా టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లలేదని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. అటు సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్ పెర్ఫార్మన్స్‌లు ఐసీసీ మెగా టోర్నీలో ఎలా ఉండబోతున్నాయోన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికర చర్చ.